Homeఎడ్యుకేషన్TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల సత్తా.. టాప్‌ ర్యాంకులన్నీ వారికే!

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల సత్తా.. టాప్‌ ర్యాంకులన్నీ వారికే!

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలను ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నీట్‌ పరీక్ష ఉండటంతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ సీట్ల భర్తీ కోసమే ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. గురువారం ప్రకటించిన తెలంగాణ ఎసెంట్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకులన్నీ ఏపీ విద్యార్థులకే దక్కాయి. ఇంజినీరింగ్‌లో టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో ఒక్క విద్యార్థి మాత్రమే నల్లగొండకు చెందిన విద్యార్థి ఉంది. ఏడో ర్యాంక్‌ శాశ్వితా రెడ్డి మాత్రమే నల్లగొండ.. మిగతా అందరూ ఏపీకి చెందినవారే. అగ్రికల్చర్‌ ర్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. అగ్రికల్చర్, మెడికల్‌ ర్యాంకుల్లో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా.. మిగతా ఏడుగురు ఏపీకి చెందినవారే.

తెలంగాణలో చదవాలని..
గతంలోనూ తెలంగాణ ఎంసెట్‌ లో ఏపీ విద్యార్థులు రాసేవారు తక్కువగా ఉండేవారు. ఏపీలో మంచి కాలేజీలు లేకపోవడం, అక్కడ చదువుకునే పరిస్థితులు లేకపోవడంతో.. వీలైనంత మంది హైదరాబాద్‌ ఆ చుట్టుపక్కన ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఐఐటీలో సీట్లు రాకపోతే.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేరిపోవడానికి ఇలా రాస్తున్నారని చెబుతున్నారు.

ఏపీలో అధ్వానంగా కాలేజీలు..
ఏపీలో ఉన్న ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కొన్ని మినహా మిగతావన్నీ ప్రభుత్వ విధానాల కారణంగా .. మెరుగైన వసతులు కల్పించలేక.. అరకొర ఫీజులు..అవి కూడా విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ చేయడం ఆలస్యం కావడం తల్లుల ఖాతాల్లో వేస్తున్న నగదు కాలేజీల్లో జమ కాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో అక్కడి రాజకీయ పరిస్థితుల కారణం కాలేజీలు కూడా డిస్ట్రబ్‌ అవుతున్నాయి. ప్రతీ సభకు విద్యార్థుల్ని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కారణాలతో ఉన్నత విద్య కోసం ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీల్లో చేరే వారిలో ఏపీ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాలు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు రాస్తూ సీట్లు సాధిస్తున్నారు.

ప్రత్యేక కోచింగ్‌..
తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని ప్రముఖ కళాశాలల్లో చేరడానికి ఏపీ విద్యార్థులు ప్రత్యేక కోచింగ్‌ కూడా తీసుకుంటున్నారు. ఇందుకోసం కూడా వారు హైదరాబాద్, బెంగళూరు, చెనై్నకి వెళ్తున్నారు. అక్కడి కోచింగ్‌ కూడా వారు ఆయా రాష్ట్రాల పోటీ పరీక్షల్లో సత్తా చాటడానికి దోహదపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular