https://oktelugu.com/

Travel: చిన్న పిల్లలతో ప్రయాణాలు చేస్తున్నారా.. అయితే తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే!

పిల్లలతో ప్రయాణాలకు బయలు దేరుతుంటే మాత్రం తల్లులకు పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వారికి కావాల్సిన అన్ని వస్తువులను ప్యాక్ చేయాలి. లేకపోతే ప్రయాణాల్లో పిల్లలు బాగా ఇబ్బంది పడతారు. మరి పిల్లలతో దూర ప్రయాణాలు చేస్తుంటే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మరి చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 30, 2024 / 01:16 AM IST

    travel with kids

    Follow us on

    Travel: ప్రయాణాలు చేయడమంటే చాలా మందికి ఇష్టం. కానీ పిల్లలతో చేయడమంటే చాలా కష్టం. ఇంట్లోనే వారిని ఆపలేం. కనీసం చెప్పిన మాట వినరు. అలాంటిది ప్రయాణాల్లో అంటే కష్టమే. ఏదో తక్కువ దూరం ప్రయాణాలు చేస్తే పర్లేదు. కొంతవరకు మ్యానేజ్ చేయవచ్చు. అదే దూర ప్రయాణాలు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సాధారణంగానే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అందులో పిల్లలతో ప్రయాణాలు చేస్తున్నారంటే తప్పకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్లు సర్దుకుని ఉన్నట్లు చిన్న పిల్లలు ఉండరు. ప్రయాణాల్లో చిరాకు పడుతూ ఏడుస్తారు. ఎందుకంటే ఒకే దగ్గర అలా ఉండిపోవడం వల్ల పిల్లలకు నచ్చదు. సరదాగా అందరితో ఆడుకుంటేనే పిల్లలు ఇష్టం. పిల్లలతో ప్రయాణాలకు బయలు దేరుతుంటే మాత్రం తల్లులకు పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వారికి కావాల్సిన అన్ని వస్తువులను ప్యాక్ చేయాలి. లేకపోతే ప్రయాణాల్లో పిల్లలు బాగా ఇబ్బంది పడతారు. మరి పిల్లలతో దూర ప్రయాణాలు చేస్తుంటే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మరి చూద్దాం.

    ఆహారం
    పిల్లలకు ఆహారం అనేది తప్పనిసరి. పెద్దవాళ్లు ఏ ఫుడ్‌ని అయిన తినేస్తారు. కానీ పిల్లలు అలా కాదు. బయట దొరికే ఫుడ్ పెడితే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పిల్లలతో ప్రయాణాలు అంటే తప్పకుండా ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ పోషకాలు ఉండే ఆహారాన్ని పట్టుకోవాలి. పాలు, వేడి నీరు అన్నింటిని క్యారీ చేయాలి. ఎక్కువ రోజులకు సరిపడా క్యారీ చేయలేకపోతే వాటికి ఏదో విధంగా ఇంకో ఆప్షన్ ముందే చూసుకోవాలి. అలాగే ఫుడ్ తింటున్నట్లయితే వారు తినడానికి ఆరోగ్యంగా ఉండేవి ప్యాక్ చేసుకోవాలి.

    ఆడుకునే వస్తువులు
    పిల్లలకు ఆడుకునే వస్తువులు, బొమ్మలు అంటే చాలా ఇష్టం. ప్రయాణాలకి ప్లాన్ చేస్తున్నప్పుడు తప్పకుండా వీటిని క్యారీ చేయాలి. ఎందుకంటే కేవలం ఒకే దగ్గర ఉంటే వారికి బోర్ కొడుతుంది. అదే బొమ్మలు ఉంటే వాటితో సరదాగా ఆడుకుంటారు. మీకు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టరు.

    మందులు
    పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు కాకుండా ఎవరైనా కూడా ప్రయాణాల్లో తప్పకుండా మందులు పట్టుకోవాలి. ఎందుకంటే ప్రయాణాల్లో వాంతులు, విరేచనాలు వంటివి అవుతుంటాయి. ఆ సమయంలో డాక్టర్ సదుపాయం ఉండదు. కాబట్టి మందులు క్యారీ చేస్తే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తొందరగా విముక్తి చెందుతారు.

    డైపర్లు, డిస్పోజల్ బ్యాగ్‌లు
    డైపర్లు అనేవి పిల్లలకు చాలా ముఖ్యమైనవి. వీటిని అసలు మర్చిపోకూడదు. ఎందుకంటే పిల్లలకు తెలియక ఎక్కడైనా మల విసర్జన, మూత్ర విసర్జన చేయవచ్చు. దీనివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వీటిని క్యారీ చేస్తే మీ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగదు. వీటితో పాటు డిస్పోజల్ బ్యాగ్‌లు కూడా ప్రయాణాల్లో పట్టుకోవాలి. వీటిని పట్టుకోవడం వల్ల ఆ డైపర్లు, ఏవైనా తిన్న తర్వాత వేస్ట్ కానీ ఉంటే వీటిలో వేసి పడేయవచ్చు. ప్రయాణాలు చేస్తుంటే అసలు వీటిని మర్చిపోవద్దు.