https://oktelugu.com/

Transgender couple : తల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్ జెండర్ జంట.. దేశంలోనే ఇది తొలిసారి.. ఇది ఎలా సాధ్యమైందంటే?

ఆడ - మగ శారీరకంగా కలిస్తే పిల్లలు పుడతారు. తద్వారా సంతానం వృద్ధి చెందుతుంది. ఆ సంతానం కాస్త దేశాభివృద్ధికి సహకరిస్తుంది. అయితే ఆడ మగ శారీరకంగా కలిసినప్పటికీ కొందరికి సంతానయోగ్యం ఉండదు.

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2024 / 07:40 PM IST

    jia jahad

    Follow us on

    Transgender couple : సంతానయోగం ఉండని వారు వివిధ రకాల పద్ధతుల్లో పిల్లల్ని కంటారు. దానివల్ల సంతాన లేమి సమస్యను అధిగమిస్తారు. అయితే విదేశాలలో ట్రాన్స్ జెండర్స్ కు ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. వారు కూడా అక్కడ అధునాతన పద్ధతుల్లో పిల్లల్ని కంటారు. అయితే ఆ విధానం ఇప్పుడు మన దేశానికి కూడా వచ్చింది. కేరళ రాష్ట్రానికి చెందిన జియా, జహద్ అనే ట్రాన్స్ జెండర్ జంట త్వరలోనే అమ్మానాన్న కాబోతున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో ఒక బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని జియా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా జియా, జహద్ కలిసి ఉంటున్నారు.. జియా తన పుట్టుకతోనే ఒక వ్యక్తి. అయితే అతడు తన శరీరంలో రకరకాల మార్పులను ఇటీవల గమనించాడు. దీంతో అతడు లింగమార్పిడి చేయించుకోవడానికి సిద్ధమయ్యాడు. అక్రమంగా అమ్మాయిగా మారడానికి రెడీ అవుతున్నాడు. ఇక జహద్ పుట్టగానే అమ్మాయి. అయితే ఆమెలో మొదటి నుంచి కాస్త పురుష లక్షణాలు ఉండేవి. దీంతో లింగమార్పిడి చేయించుకొని అబ్బాయిగా మారే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో జహద్ గర్భం దాల్చింది. దీంతో వైద్యులు ఆమెకు లింగమార్పిడి ప్రక్రియను నిలిపివేశారు. దీంతో మన దేశంలోనే తొలిసారిగా గర్భం దాల్చిన ట్రాన్స్ మెన్ గా జహద్ నిలిచాడు. అయితే లింగమార్పిడి పక్కకిలో భాగంగా జహద్ కు ఇప్పటికే అతడి వక్షోజాలను వైద్యులు తొలగించారు. గర్భాశయాన్ని కూడా తొలగించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె గర్భం కాల్చడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే పుట్టే బిడ్డకు దాతల ద్వారా పాలు అందిస్తామని జియా, జహద్ చెబుతున్నారు. అయితే వీరిద్దరికి సంబంధించిన ట్రాన్స్ జెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పుట్టే బిడ్డకు ఇబ్బందులు లేవని కోజి కోడ్ వైద్య కళాశాల వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఇదంతా సాధారణ ప్రక్రియ గానే తాము కొనసాగిస్తున్నామని వైద్యుల పేర్కొంటున్నారు.

    విదేశాలలో ఎలా ఉందంటే ..

    విదేశాలలో ట్రాన్స్ జెండర్లు కలసి జీవించవచ్చు. పిల్లల్ని కూడా కనవచ్చు. దాతల ద్వారా పాలు సేకరించి.. ఆ పిల్లలకు పట్టవచ్చు. స్వేచ్ఛాయుత జీవన విధానాన్ని పాశ్చాత్య దేశాలు కల్పిస్తున్నాయి. కానీ మనదేశంలో ఇంకా ఆ తరహా జీవన విధానం కాబట్టి చట్టాలు రూపొందించలేదు. ఇటీవల ట్రాన్స్ జెండర్ ల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. వారికి ప్రత్యేకమైన హక్కులు ఉండబోవమని స్పష్టం చేసింది. దీనిపై రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ.. కేంద్రం వెనకడుగు వేయలేదు. స్వేచ్ఛాయుత జీవన విధానానికి తాము అడ్డంకి కాబోమని కేంద్రం చెప్పినప్పటికీ.. అవి పరిధి దాటితే ఊరుకోబోమని హెచ్చరించింది..” విదేశాలలో అక్కడి చట్టాలు వేరే విధంగా ఉంటాయి. వాటిని మన దేశానికి ఆపాదించొద్దు. మన దేశం వసుదైక కుటుంబం లాంటిది. అలాంటి దేశంలో చిత్రచిత్రమైన డిమాండ్లు తెరపైకి తీసుకురావద్దు. దీనివల్ల మిగతా సమాజంలో గందరగోళం ఏర్పడుతుందని” కేంద్రం అప్పట్లో వ్యాఖ్యానించింది.