Pradeep Raj: గత రెండేళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ హీరోలు అకాల మరణం పొందుతున్నారు. 2020 సంవత్సరంలో హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం పొందారు. ఆయన గుండెపోటు కారణంగా మరణించారు. చిరంజీవి సర్జా మరణం మరవక ముందే 2021లో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. గుండెల్లో నొప్పిగా ఉందని ఆసుపత్రికి స్వయంగా బయలుదేరిన పునీత్ మార్గం మధ్యలో మరణించారు. కారు వరకూ కూడా నడిచి వచ్చిన పునీత్… ఐదు నిమిషాల వ్యవధిలో మరణించారు.

ఇక ఇటీవల సీరియల్ నటి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. తాజాగా ప్రముఖ దర్శకుడు కరోనా మహమ్మారికి బలయ్యాడు. కన్నడ పరిశ్రమలో స్టార్ దర్శకులలో ఒకరైన ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు . జనవరి 20 గురువారం ప్రదీప్ పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
Also Read: ప్రేమికుల దినోత్సవం రోజు రిలీజ్ కానున్న మహేష్ – కీర్తి లవ్ ట్రాక్ !

గత 15 ఏళ్లుగా ప్రదీప్ రాజ్ షుగర్ పేషేంట్ గా ఉన్నారు. ఈ కారణంగా ఆయన కరోనాను ఎదిరించలేకపోయారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని డాక్టర్లు వెల్లడించారు. 46 ఏళ్ల ప్రదీప్ రాజ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాండిచ్చేరిలో అంత్యక్రియలు జరగనున్నాయి. కెజిఎఫ్ హీరో యష్ తో కలిసి ‘కిచ్చా’, ‘కిరాతక’ అనే సూపర్ హిట్ సినిమాలను తెరక్కించారు. అలాగే గోల్డెన్ స్టార్ మిస్టర్, రజనీకాంత, సతీష్ నీనాసం, అంజాద్ మాలే సినిమాలను కూడా ప్రదీప్ తెరకెక్కించారు. కాగా కరోనా రాకముందు యష్ తో కలిసి కిరాతక 2 తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రదీప్ ప్రకటించారు. అయితే ఆ కల నెరవేరకుండానే ఈ విషాదం చోటుచేసుకుంది. డైరెక్టర్ ప్రదీప్ రాజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: జగన్ సార్.. పేదలపై నీ ప్రతాపమేలా?
[…] […]