Towel: స్నానం లేదా బయట నుంచి వచ్చిన తర్వాత తప్పకుండా అందరూ ఫ్రెష్ అవుతారు. ఈ సమయంలో టవల్‌తో తుడుచుకుంటారు. అయితే కొందరు ఈ టవల్‌ను అసలు శుభ్రం చేయరు. పెద్దగా వాడట్లేదని భావించి రోజులు గడిచిన కూడా వీటిని అసలు ఉతకరు. దీనివల్ల అందులో క్రిములు ఉండిపోయి ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. టవల్‌ను ఎప్పటికప్పుడూ శుభ్రం చేయాలి. లేకపోతే అందులో బ్యాక్టీరియా, ఫంగస్ ఉండిపోయి శరీరానికి హాని చేస్తుంది. టవల్‌ను తప్పకుండా వాడుతుంటారు. అలాంటి టవల్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టవల్‌తో తుడుచుకున్నప్పుడు కాస్త తేమ కావడం వల్ల అందులో బ్యాక్టీరియా ఉండిపోతాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ముఖ్యం చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టవల్‌ను డైలీ వాష్ చేయకపోతే తప్పకుండా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. మరి టవల్‌ను ఎన్ని రోజులకు ఒకసారి వాష్ చేయాలి? ఎలా వాష్ చేస్తే అందులోని బ్యాక్టీరియా తొలగి పోతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టవల్‌ను వాష్ చేయకుండా రోజూ వాడటం వల్ల అందులో బ్యాక్టీరియా, ఫంగస్ చేరిపోతాయి. ఇవి శరీరానికి చర్మ సంబంధిత వ్యాధులు వచ్చేలా చేస్తాయి. ఈ టవల్‌లో ఉండే బ్యాక్టీరియా వల్ల చర్మం దెబ్బ తిని పొట్టులా రాలిపోతుంది. నిజానికి టవల్‌ను డైలీ వాష్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ వాష్ చేయడానికి కుదరని వారు కనీసం రెండు రోజులకి అయిన ఉతకాలి. అప్పుడే అందులో బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. ఎవరి టవల్ వారు మాత్రమే వాడాలి. ఇతరుల టవల్ వాడటం వల్ల వారికి ఉన్న ఇన్ఫెక్షన్లు మీకు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి మీ టవల్‌ను మీరే వాడండి. వాష్ చేయని టవల్ వాడటం వల్ల అందులోని ఫంగస్, బ్యాక్టీరియా ఉండిపోతాయి. దీంతో మీకు ముఖం తుడుచుకుంటే చర్మంపై మొటిముల, మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా పాపిల్లోమా వైరస్ సోకుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి టవల్ వాడవద్దు. అయితే టవల్స్‌ను వేడి నీటిలో మాత్రమే వాష్ చేయాలి. ఎందుకంటే వేడి నీటిలో వాష్ చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా, ఫంగస్ అంతా కూడా వేడి నీటికి చనిపోతుంది. లేకపోతే అవి జీవించి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.
కొందరు అన్నింటికి ఒకే టవల్‌ను వాడుతుంటారు. అలా కాకుండా స్నానం, ఫేష్ వాష్, కాళ్లు చేతులు ఇలా ఒక్కో దానికి ఒక్కో టవల్ ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఎంత స్నానం చేసిన కూడా కొన్ని ప్రదేశాల్లో క్రిములు ఉండిపోతాయి. కాబట్టి సెపరేట్‌గా వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బయటకు వెళ్లినప్పుడు ఇతరుల టవల్స్ వాడకుండా కేవలం మీ టవల్స్ మాత్రమే ఉపయోగించండి. టవల్‌ను వేడి నీటిలో వాష్ చేసేటప్పుడు వెనిగర్, యాంటీ సెప్టిక్, డెటాల్ వంటివి కూడా వేయాలి. టవల్‌ను నీడలో కాకుండా సూర్యరశ్మి ఉన్న ప్రదేశంలో మాత్రమే ఆరవేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా అంతా వెళ్లిపోతుంది. కాబట్టి టవల్ విషయంలో అజాగ్రత్తగా ఉండవద్దు. తప్పకుండా ఈ నియమాలు పాటించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.