https://oktelugu.com/

Top Selling Cars: అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు ఇవే..

మారుతి నుంచి వివిధ మోడళ్లలో మార్కెట్లోకి వచ్చి అలరిస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం బాగా ఇంప్రెస్ చేస్తున్న కారు స్విఫ్ట్. స్విప్ట్ గతంలోనే తక్కువ బడ్జెట్ లో అందుబాటులోకి రావడంతో చాల మంది వినియోగదారులు దీనిని సొంతం చేసుకున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 26, 2023 / 02:53 PM IST

    Top Selling Cars

    Follow us on

    Top Selling Cars: కరోనా తరువాత కార్ల వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో చాలా మంది సొంతకారును కలిగి ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు సైతం తక్కువ బడ్జెట్ లోనే కొన్నిమోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దేశీయ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకీ నుంచి రిలీజైన కార్లు అగ్రగామిలో నిలుస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే మారుతి కంపెనీకి చెందిన ఓ మోడల్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆది ఏ మోడల్? ఎన్ని అమ్ముడుపోయాయి? అనే వివరాల్లోకి వెళితే..

    మారుతి నుంచి వివిధ మోడళ్లలో మార్కెట్లోకి వచ్చి అలరిస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం బాగా ఇంప్రెస్ చేస్తున్న కారు స్విఫ్ట్. స్విప్ట్ గతంలోనే తక్కువ బడ్జెట్ లో అందుబాటులోకి రావడంతో చాల మంది వినియోగదారులు దీనిని సొంతం చేసుకున్నారు. తాజాగా అప్డేట్ ఫీచర్స్ తో మరిన్ని హంగులు తీర్చి దిద్దుకొని మార్కెట్లో అలరిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న స్విప్ట్ కు సైతం వినియోగదారులు ఫిదా అయ్యారు. దీంతో పాత స్విప్ట్ చాలా వరకు అమ్ముడు పోయాయి.

    2023 జూలై నెల వివరాలు పరిశీలిస్తే స్విప్ట్ 17,896 యూనిట్లను విక్రయించి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇదే మోడల్ 2022లో 17,539 యూనిట్లు విక్రయించింది. ఈ నెలలో వీటి అమ్మకాలు పెరిగినా వార్షికంగా మాత్రం 2 శాతం మాత్రమే వృద్ధి సాధించాయి. స్విప్ట్ తరువాతి స్థానంలో మారుతి కంపెనీకి చెందిన బాలెనో ఉంది. ఈ మోడల్ 2023 లో 16,725 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. ఆ తరువాత 16,543 యూనిట్ల విక్రయాలతో బ్రెజ్జా మూడో స్థానంలో ఉంది.

    మారుతి స్విఫ్ట్ ఫీచర్స్ ను పరిశీలిస్తే 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ తో కలిగి ఉండి 23.76 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ పై 30.90 మైలేజ్ ఇస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ కలిగిన స్విఫ్ట్ ధర రూ.5.99 లక్షల నుంచి ప్రారంభం మై రూ.9.03 వరకు విక్రయిస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండడంతో పాటు తక్కువ బడ్జెట్ లో సొంతం చేసుకోవాలనుకునే వారు స్విప్ట్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.