Tomatos: టామాటాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయా? ఏది నిజం? ఏదీ అబద్ధం?

వాస్తవానికి కిడ్నీలు రాళ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరతత్వంతో పాటు తీసుకున్న ఆహారాన్ని బట్టి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. కానీ కేవలం టామాటాలు తినడం వల్లనే కిడ్నీలు ఏర్పడుతాయనేది చెప్పలేమని కొందరు వైద్యుులు చెబుతున్నారు.

Written By: Srinivas, Updated On : March 15, 2024 4:16 pm

tomatos

Follow us on

Tomatos: రోజూవారీ ఆహారంలో భాగంగా అన్నంలో కచ్చితంగా ఏదో ఒక కర్రీ ఉండేలా చూసుకుంటాం. ఇందు కోసం మార్కెట్లోకి వెళ్లి రకరకాల కూరగాయలు తెచ్చుకుంటాం. చాలా మంది మాంసాహారాలతోనే అధిక శక్తి వస్తుందని అనుకుంటారు. కానీ కొన్ని కూరగాయల్లో ఉండే ప్రోటీన్లు, పోషకాల గురించి తెలిస్తే వాటిని విడిచిపెట్టరు. కూరగాయల్లో అన్నికాలాల్లో లభించేవి కొన్ని ఉంటాయి. వీటిలో టామాటాలు ముఖ్యమైనవి. వీటితో కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందువల్ల కొందరు ఎక్కువ శాతం టామాట కర్రీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కేవలం టామాటాలే కాకుండా వీటిలో పప్పు, చిక్కుడు ఇతర పదార్థాలు వేసి కాంబినేషన్ కర్రీ చేసుకుంటారు. అయితే టామాటాలు ఎక్కువగా తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయని కొందరి భావన. నిజంగానే ఇవి తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయా?

శరీరంలోని రక్తాన్ని కిడ్నీలు వడబోస్తాయి. ఈ క్రమంలో శుద్ధి అయిన రక్తం ఇతర అవయవాల్లోకి వెళ్తుంది. మలినాలను మూత్రాశయం ద్వారా కిందికి వదులే పనిని కిడ్నీలు చేస్తాయి. ఆహారంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని మలినాలు ఏర్పడి స్పటికంలా మారుతాయి. ఒక్కోసారి ఇవి పెద్దగా అయి మూత్రాశయం ద్వారా వెళ్లకుండా ఆగిపోతాయి. దీంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డాయని వైద్యులు గుర్తిస్తారు. అయితే ఇవి ఎక్కువగా టమాటాలు తినడం వల్లనే వస్తాయని కొందరు అంటున్నారు.

వాస్తవానికి కిడ్నీలు రాళ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరతత్వంతో పాటు తీసుకున్న ఆహారాన్ని బట్టి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. కానీ కేవలం టామాటాలు తినడం వల్లనే కిడ్నీలు ఏర్పడుతాయనేది చెప్పలేమని కొందరు వైద్యుులు చెబుతున్నారు. అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారు మాత్రం టామాటాలు, పాలకూర తినకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇవి తినడం వల్ల కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లపై మరింత ప్రభావం చూపుతాయనేది మాత్రం వాస్తవం.

అంతేగానీ.. కిడ్నీ సమస్య లేని వారు నిరభ్యంతరంగా టామాటాలు తినొచ్చు.టామాటాలు తీనడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్య ఉండదు. అంతేకాకుండా వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. టమాటాను కేవలం కర్రీగానే కాకుండా వివిధ పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఫిజా హాట్ లో దీనినిఎక్కువగా వాడుతారు. అందువల్ల టమాటాలు ఆరోగ్య సమస్య ఉన్న వాళ్లు తప్ప మిగతా వారు తినడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు.