Making Disha Tips: టిఫిన్స్‌లో చాలా మందికి దోశలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్‌కి కూడా పెట్టిన తినేస్తారు. ఇవి తినడానికి టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే దోశలు అనేవి చాలా మంది క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. అయితే వీటిని ఇంట్లోనే తయారు చేసేటప్పుడు క్రిస్పీగా రావు. ఇంట్లో దోశలు అయితే మెత్తగా వస్తాయి. ఇవి తినడానికి టేస్టీగా ఉన్నా కూడా చాలా మందికి నచ్చవు. అయితే ఇంట్లో చేసుకునే దోశలు హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మనం హోటల్స్‌లో తినేటప్పుడు వీరు ఇంత క్రిస్పీగా ఎలా తయారు చేస్తారు? అసలు ఇందులో ఏం కలుపుతారని అంటుంటారు. హోటల్‌లో తయారు చేసేవారు ఇందులో ఏం పెద్దగా కొత్త పదార్థాలు కలపరు. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను కలిపి క్రిస్పీగా నచ్చే విధంగా తయారు చేసుకోవచ్చు. మరి హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా దోశలు తయారు చేసుకోవడం ఎలాగో ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.
దోశలు హోటల్ స్టైల్‌లో రావాలంటే బియ్యం, మినపప్పు సరైన కొలతలో తీసుకోవాలి. అయితే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల బియ్యం తీసుకోవాలి. అయితే ఈ దోశలకు రేషన్ బియ్యం ఉంటే టేస్టీగా వస్తాయి. బియ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా దోశలు వస్తాయి. దోశలు చేసేముందు బియ్యం, మినపప్పును కనీసం ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత దోశ పిండిని తయారు చేసుకోవాలి. గ్రైండ్ లేదా మిక్సీలో వేసుకుని మెత్తగా తయారు చేసుకోవాలి. అయితే ఈ దోశలు క్రిస్పీగా రావాలంటే ఇందులో అటుకులు లేదా రవ్వ కలపాలి. దోశ పిండి గ్రైండ్ చేసుకునే ముందు ఇందులో అటుకులు కలిపి చేసుకుంటే దోశలు టేస్టీగా వస్తాయి. వీటితో పాటు దోశ పిండిలో గోధుమ రవ్వ కలిపిన కూడా దోశలు టేస్టీగా ఉంటాయి. దోశ పిండి కలిపిన తర్వాత రవ్వ వేసి ఒక నాలుగు గంటల పాటు ఉంచాలి. ఆ తర్వాత దోశలు వేస్తే చాలా క్రిస్పీగా హోటల్ స్టైల్ దోశలుగా వస్తాయి.
దోశలు క్రిస్పీగా రావాలంటే వీటితో పాటు మెంతులు కూడా వేయాలి. మినపప్పు, బియ్యం నానబెట్టి నప్పుడు దోశల్లో కాస్త మెంతులు, కందిపప్పు, శనగపప్పు వేయాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు టేస్టీగా వస్తాయి. అయితే మెంతులను ఎక్కువగా వేయకూడదు. కేవలం టేబుల్ స్పూన్ మెంతులు మాత్రమే తీసుకోవాలి. మెంతులు ఎక్కువ అయితే దోశలు చేదు వచ్చే ప్రమాదం ఉంది. అయితే దోశలు చేసేటప్పుడు చాలా మంది నాన్‌స్టిక్ పెనం మీద వేస్తుంటారు. నాన్‌స్టిక్ పెనం కంటే ఐరన్ పెనం మీద అయితే దోశలు హోటల్ స్టైల్‌లో వస్తాయి.