plant : ఈ మొక్కను గరుడ ముక్కు మొక్క అంటారు. అరె భలే వింతగా ఉంది కదా. ఇది మాత్రమే కాదండోయ్ ఈ మొక్కకు తేలు కొండి మొక్క అనే మరో పేరు కూడా ఉంది. మార్టీలియా నోవా ఈ మొక్క శాస్త్రీయ నామం. అయితే ఇది ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తుంది. చాలా మందికి ఈ మొక్క గురించి, దాని ప్రయోజనాల గురించి తెలియదు. చాలా మంది పిచ్చి మొక్క అనుకుంటారు. కాలువల ప్రాంతాల్లో ఎక్కువగా వృద్ధి చెందుతుంది. దీని ప్రయోజనాలు తెలిసిన వారు పురాతన కాలం నుంచి వినియోగిస్తున్నారు.
శరీరానికి చాలా విధాలుగా ఈ మొక్కను వినియోగిస్తారు. క్షయ వ్యాధికి కూడా చాలా ఉపయోగపడుతుంది.వీటి ఆకుల రసాన్ని మెడ మీద ప్రతి రోజు పోయడం వల్ల ఔషధంగా ఉపయోగపడుతుందట. గొంతు నొప్పితో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుకిలించి ఉమ్మాలి. ఇలా చేస్తే గొంతు నొప్పికి ఉపశమనం లభిస్తుంది. జాయింట్ పెన్స్, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది ఈ మొక్క. అయితే ఈ మొక్క వేర్లను తీసుకొని వచ్చి పొడి చేసుకోవాలి. దాన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయమే పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్క వేర్ల కషాయాన్ని పాము కాటుకు విరుగుడుగా కూడా వినియోగిస్తున్నారు.
మరో ముఖ్యమైన విషయం నరదిష్టిని కూడా తరిమికొట్టే గుణం వీటికి ఉంది. ఇందుకోసం ఎండిన ఈ తేలుకొండి కాయలను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టాలి. కొత్త వాహనాలకు కూడా వీటిని కట్టడం వల్ల దిష్టి తగలదు. మీకు ఎలాంటి సమస్యలు రావు అంటున్నారు పండితులు. మధ్యప్రదేశ్ లోని కొందరు ఈ మొక్కను మాంత్రిక, తాంత్రిక విధ్యలకు కూడా ఉపయోగిస్తారట. ఈ చెట్టు ఆకులు రాత్రి ఆకాశం వైపు చూస్తున్నట్టు నిల్చుంటాయట. తేలు కాటుకు కూడా విరుగుడుగా పని చేస్తుంది ఈ చెట్టు.