Financial mistake: మంచి జీవితం కావాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ అందుకోసం తగిన కృషి చేయడానికి మాత్రం ఎవరూ సాహసించరు. మంచి జీవితం కావడానికి కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు.. గుట్టలు పగలగొట్టాల్సిన పనిలేదు. కేవలం కొన్ని లక్షణాలు కలిగి ఉంటే చాలు. ఈ లక్షణాలు ఆర్థికపరమైన భరోసా ఇవ్వడానికి ఉండాలి. ఇలా ఉంటే ఆ వ్యక్తితో పాటు కుటుంబం కూడా సేఫ్ గా ఉంటుంది. అంటే ఈ కాలంలో ఒక కుటుంబం సేఫ్ గా ఉండాలంటే డబ్బు మాత్రమే ప్రధానంగా నిలుస్తుంది. డబ్బు సంపాదించడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఓ తప్పు వల్ల ఆ డబ్బు నిలువ లేకుండా చేసుకుంటున్నారు. మరి ఆ తప్పు ఏంటి?
Also Read: నిద్ర సరిగా రావడం లేదా? అయితే నిద్రపోయే ముందు ఇలా చేయండి..
చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడి మంచి ఉద్యోగం సాధిస్తుంటారు. అయితే ఉద్యోగం రాగానే జీవితంలో గెలిచినట్లు చాలామంది అనుకుంటారు. కానీ అసలు జీవితం ఇప్పుడే మొదలైందని కొందరు మాత్రమే గుర్తిస్తారు. అసలు జీవితం అంటే ఏంటంటే..? వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా పొదుపు చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి సరైన జీతం అందగానే ముందుగా జల్సా లకు వేస్ట్ చేస్తారు. ఆ తర్వాత కొత్త బైక్ లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. అంటే ఏదో రకంగా తమకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఈఎంఐ ని ఏర్పాటు చేసుకుంటారు. ఈఎంఐ ద్వారా నెలనెలా పే చేస్తూ ఇబ్బందులేకుండా ఉండొచ్చు అని భావిస్తారు.
కానీ ఒక్కసారి ఈఎంఐ ని ప్రారంభిస్తే జీవితం చిక్కులో పడ్డట్లే. ఎందుకంటే ఈఎంఐ పే చేయడం ఉండడం వల్ల.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యాలయం నుంచి జీతం రాగానే వెంటనే ఈఎంఐ కి వెళ్తుంది. మిగిలిన దాంట్లో జీవితాన్ని గడపాలి. ఇది సరిపోకపోతే మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు తీర్చడానికి మరో అప్పు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగం కొనసాగితే పర్వాలేదు. కానీ దురదృష్టం వెంటాడితే మాత్రం భారం మీద పడ్డట్లే.
Also Read: రూ.10 వేల జీతం కంటే రూ.10 లక్షల జీతం వస్తే జీవితం ఎలా ఉంటుందంటే?
ఇలాంటి అప్పుడు జీతం రాగానే ఈఎంఐ నీ ఏర్పాటు చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు? కొత్త ఇల్లు కొనుక్కోవడం.. కొత్త కారు కొనుక్కోవడం అందరికీ అవసరమే. కానీ ఉద్యోగం వచ్చిన కొన్ని ఆళ్ల తర్వాత.. కొంత డబ్బు కూడా పెట్టిన తర్వాత.. అలా చేయడం ద్వారా కొంతవరకు సమస్య ఉండకపోవచ్చు. అలా కాకుండా వచ్చిన జీవితంలో సగం వరకు ఈఎంఐ కి వెళ్తే ఎంతో బాధగా ఉంటుంది. వస్తువులు కొన్న సమయంలో ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఈఎంఐ చెల్లించే క్రమంలో ఎంతో బాధపడాల్సి వస్తుంది. అందువల్ల కొత్తగా ఉద్యోగంలోకి జాయిన్ అయిన వారు వెంటనే ఈఎంఐ ని ప్రారంభించకండి. కొన్నాళ్లు డబ్బు కూడా పట్టిన తర్వాత.. వస్తువుల కొనుగోలు గురించి ఆలోచించాలి.