Life changing thoughts: మనిషిని నడిపించేది ఆలోచనే అని కొందరు మేథావులు చెబుతూ ఉంటారు. ఆలోచన ప్రకారమే తమ జీవితం ఉంటుందని అంటారు. మంచి ఆలోచనలతో సరైన జీవితాన్ని ఎంచుకుంటారని.. చెడు ఆలోచనలతో జీవితం వక్రమార్గంలో వెళ్తుందని పేర్కొంటారు. అయితే కొందరు మంచిగా ఆలోచించినా.. వారిలో ఎవరో ఒకరు ఉన్నతంగా ఆలోచిస్తారు. ఉన్నతంగా ఆలోచించేవారి గొప్పవారీగా ఎదిగిపోతారు. అసలు ఉన్నతంగా ఆలోచించడం అంటే ఎలా? ఎవరు ఇలాంటి ఆలోచనలు చేస్తారు? దీనిని అర్థం చేసుకోవడానికి ఈ స్టోరీ మీకోసం..
ఒకసారి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారంతా ఒకచోట సమావేశం అయ్యారు. ఇందులో రతన్ టాటా కూడా ఉన్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి ల్యాండ్ రోవర్ కారు కొనడానికి ఎంత సమయం పడుతుంది? అని ఒక వ్యాపారుడిని అడుగుతాడు. దీంతో అతడు మూడు సంవత్సరాలు పడుతుంది అని చెప్తాడు. మరో వ్యాపారుడని అడగగా నాలుగు సంవత్సరాలు పడుతుంది అని చెప్తాడు. ఇంకో వ్యాపారుడని అడగగా ఒక సంవత్సరంలో కొనుగోలు చేస్తానని అంటాడు. చివరికి రతన్ టాటా ను ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు చేయడానికి ఎంత సమయం పడుతుంది అని అడగగా… ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అని చెబుతాడు. మిగతా వ్యాపారులు ఆశ్చర్యపోతారు. మీరు ఒక కారు కొనడానికి ఇంత సమయం ఎందుకు తీసుకుంటారు? అని ప్రశ్నిస్తారు.
అప్పుడు రతన్ టాటా మాట్లాడుతూ.. నేను కారు కొనాలని చూడడం లేదు.. కారు కంపెనీ కొనాలని చూస్తున్న.. అని అంటాడు. అంటే మిగతావారు కేవలం కార్లు మాత్రమే చూస్తారు.. రతన్ టాటా మాత్రం కారు కంపెనీ కొనుగోలు చేయాలని అనుకుంటాడు. అలా ఆలోచించబట్టే మిగతా వారి కంటే ఎంతో ఎత్తుకు ఎదిగాడు రతన్ టాటా.
మనుషులు కూడా చిన్న విషయాల గురించి పట్టించుకోకుండా.. భవిష్యత్తు గురించి.. ఉన్నతమైన ఆలోచనలు కలిగితే.. మిగతా వారి కంటే గొప్పగా బతికే అవకాశం ఉంటుంది. ఇలా ఆలోచించడం మాత్రమే కాకుండా.. ఆచరణలో పెట్టే ధైర్యం కూడా కావాలి. ఒక వ్యాపారం చేయాలని కొందరు అనుకుంటే.. ఆ వ్యాపారం ప్రపంచ స్థాయికి ఎదగాలని ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి మాత్రమే ఆలోచిస్తాడు.
నేటి కాలంలో కొందరు ఒక పనిని ప్రారంభించగానే కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు.. వాటి పరిష్కారం గురించి ఆలోచించకుండా.. తమ జీవితంలోకి అవి ఎందుకు వచ్చాయి? అని ఆలోచిస్తారు. అంతేకాకుండా తమ జీవితం ఇంకొకరిపై ఆధారపడినట్లు భావిస్తారు. ఎవరి జీవితం వారిదే.. ఎవరి సంపాదన వారిదే.. అనే ఆలోచనతో కలిగి ఉంటే.. ఎప్పటికైనా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.