Bangkok Tourism: పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది. ఇందులో విదేశాల్లో విహరించాలని కొంతమంది ప్రత్యేకంగా ప్లాన్లు చేసుకుంటారు. అయితే ప్రపంచంలో అందమైన ప్రదేశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కొన్ని ప్రదేశాలను ప్రజలు బాగా ఇష్టపడుతున్నట్లు తేలింది. వీటిలో యూత్ ఎక్కువగా ఇష్టపడే టాప్ టెన్ సిటీల జాబితాను టైం అవుట్ అనే సంస్థ రిలీజ్ చేసింది. వీటిలో నెంబర్ 1 స్థానంలో బ్యాంకాక్ నిలిచింది. ఈ నగరం నెంబర్ వన్ స్థానంలో నిలవడానికి ఈ కారణాలు ఉన్నాయి..
యవ్వనంలో ఉన్నవారు ఎక్కువగా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ సమయంలో విదేశాల్లోకి వెళ్తే మరింత సంతోషంగా ఉండవచ్చు. అయితే స్నేహితులంతా కలిసి విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు బ్యాంకాక్ బెస్ట్ సిటీగా పేర్కొంటున్నారు. యువత ఎక్కువగా ఇష్టపడే స్వేచ్ఛ, నైట్ కల్చర్ ఈ సిటీలో ఆకర్షిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ ధరలు కూడా అదుపులో ఉండడంతో చాలామంది ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
బ్యాంకాక్ లో ధరలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ స్టే చేయడానికి గదికి ఒక్కరోజు రూ.1000 నుంచే ప్రారంభమవుతుంది. లగ్జరీ కావాలని అనుకునేవారు అధిక ధరలు చెల్లించవచ్చు. అలాగే ఈడ కొన్ని వస్తువుల ధరలు కూడా అదుపులోనే ఉంటాయి. ముఖ్యంగా భారత్ కంటే ఇక్కడ బంగారం ధర కూడా చాలా తక్కువ. అందుకే చాలామంది ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతారు.
బ్యాంకాక్ లో ప్రధానంగా ఆకర్షించేది నైట్ కల్చర్. ఇక్కడ రాత్రిపూట బార్ లు నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. దీంతో చాలామంది ఇక్కడ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఓపెన్ టాప్ డాన్సింగ్ కూడా ఉండడంతో స్నేహితులతో కలిసి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. ఇక రాత్రి పూట ఇక్కడ ఉండే మార్కెట్ ఎంతో ఆకర్షిస్తుంది. వీటిలో ఖావో శాన్ రోడ్ లో ఉండే మార్కెట్ మరీ రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఉండే వస్తువులు కూడా చాలా తక్కువగా ఉంటాయని అంటుంటారు. అలాగే క్రీడల పై ఆసక్తి ఉన్నవారు రాత్రి జరిగే కిక్ బాక్సింగ్ ను చూడొచ్చు. లుంబిని పార్కులోకి వెళ్లి ఆనందంగా గడపొచ్చు. ఈ విధంగా నైట్ కల్చర్ బ్యాంకాక్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
బ్యాంకాక్ కు ఎక్కువగా పర్యాటకులు రావడానికి ప్రధాన ఆకర్షణ ఇక్కడ క్వాలిటీ లైఫ్ ఉండడమే. అన్ని రకాల సౌకర్యాలు ఉండడంతో స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. నాణ్యమైన రోడ్లు ఉండడంతో సిటీ మొత్తం తిరగవచ్చు. కావాల్సినవారికి లగ్జరీ హోటల్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సముద్రం దగ్గరగా ఉండడంతో విలాసవంతంగా గడపవచ్చు. మిగతా దేశాల్లో కంటే ఇక్కడ విభిన్న కల్చర్ ఉండడంతో చాలామంది వాటిని ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా యూత్ కు అనుకూలంగా ఈ నగరం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. దీంతో ఎక్కువ శాతం యూత్ ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు. అయితే టైమ్స్ అవుట్ వెల్లడించిన జాబితాలో బ్యాంకాక్ తర్వాత మెల్బోర్న్, captown సిటీలు నిలిచాయి.