https://oktelugu.com/

Credit card : ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే జరిగేది ఇదే.. జాగ్రత్త..

ఒకసారి ఒక కార్డుపై ఆఫర్ ప్రయోజనం పొందితే మరోకార్డు ద్వారా కొత్త ఆఫర్ రాకపోవచ్చు. ఇలా కొన్ని కార్డుల ద్వారా ఆఫర్స్ తగ్గిపోవచ్చు. అందువల్ల ఎక్కువ కార్డులను కలిగి ఉండడం కంటే అవసరమైన కొన్ని కార్డులను వాడడం మంచిది.

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2024 / 08:44 PM IST

    Credit Card

    Follow us on

    Credit card : ప్రస్తుత కాలంలో చిరుద్యోగి వద్ద కూడా క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. కొన్ని బ్యాంకులు కొత్తా ఖాతాలు తెరిచేందుకు క్రెడిట్ కార్డులు ఆఫర్ చేరస్తున్నాయి. ఎలాంటి యాన్యువల్ ఫీజు లేకుండా ఈ కార్డులు ఇస్తుండడంతో చాలా మంది ఒకటికి మించి క్రెడిట్ కార్డులు కలిగి ఉంటున్నారు. క్రెడిట్ కార్డుల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు చేతిలో డబ్బులు లేకున్నా నెల రోజుల ముందే కొనుగోలు చేసుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్ ను బ్లాక్ చేసి రుణం తీసుకోచ్చు. అలాగే క్రెడిట్ కార్డులను సరైన పద్ధతిలో ఉపయోగించకుంటే భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది. సరైన తేదీల్లో క్రెడిట్ కార్డు బిల్లు పే చేయకుంటే భారీగా వడ్డీ విధిస్తారు. అయితే ప్రస్తుతం చాలా మంది వద్ద ఒకటి నుంచి 10 వరకు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?

    సిబిల్ స్కోర్:
    బ్యాంకు ద్వారా ఆఫర్స్, రివార్డు పాయింట్స్ పొందడానికి సిబిల్స్ స్కోర్ తప్పనిసరి. ఇది బాగుంటనే బ్యాంకులో గుడ్ కస్టమర్ గా పేర్కొంటారు. దీంతో తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు. రివార్డ్ పాయింట్స్ ఎక్కువగా రావొచ్చు. కొన్ని ఆఫర్లతో వస్తువులు కొనుగోలు చేయొచ్చు. అయితే ఒకటికి మించి కార్డులు ఉన్న వారు అన్ని కార్డులను సమపాళ్లలో వాడుతూ ఉండాలి. ఒక కార్డును రెగ్యులర్ గా వాడి మరో కార్డును వాడకపోయినా.. ఆ కార్డు క్రెడిట్ రిజర్వ్ చేయబడుతుంది. ఈ ప్రభావం సిబిల్ స్కోరు పై పడుతుంది. ఫలితంగా బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం లేదా, వివిధ ఆఫర్ల నుంచి దూరంగా ఉంటారు.

    పేమేంట్ భారం:
    క్రెడిట్ కార్డులు ఒకటికి మంచి ఎక్కువగా ఉంటే దుబారా ఖర్చులుంటాయి. కొన్ని కార్డులపై ఆఫర్స్ వస్తుంటాయి. దీంతో కొందరు అవసరం లేకున్నా వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే దాని పేమెంట్ చేసేటప్పుడు మాత్రం అవస్థలు పడుతారు. ఇలా ఎక్కువ కార్డుల బిల్లులు సరైన తేదీల్లో కట్టలేకపోతే అధిక వడ్డీ వసూలు చేస్తారు. ఒక్కోసారి ఇది 36 శాతం కూడా ఉండే అవకాశం ఉంది.ఇది కూడా ఇన్ టైంలో చెల్లించకపోతే దానిపై కూడా చక్రవడ్డీ విధిస్తారు.

    అదనపు ఛార్జీలు:
    కొన్ని బ్యాంకులు తమ ఖాతాలను పెంచుకోవడానికి తాత్కాలికంగా ఆఫర్ల ప్రకటిస్తారు. దీంతో క్రెడిట్ కార్డు తీసుకున్న తరువాత ఛార్జీలు విధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు 10 క్రెడిట్ కార్డులు ఉంటే వీటి ఆన్యువ్ ఫీజు ఒక ఈఎంఐ అంత ఖర్చు అవుతుంది. అందులోనూ రెగ్యులర్ గా కార్డు వాడకపోతే హోల్డ్ లో పెడుతారు. మళ్లీ దానిని యాక్టివ్ చేసుకోవడానికి తిప్పలు పడుతారు.

    ఆఫర్లు తగ్గొచ్చు:
    క్రెడిట్ కార్డుపై అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తుంటాయి. అయితే ఒకే మొబైల్ పై ఎక్కువ కార్డులు ఉన్న వారికి ఈ ఆఫర్లు వర్తించకపోవచ్చు. ఒకసారి ఒక కార్డుపై ఆఫర్ ప్రయోజనం పొందితే మరోకార్డు ద్వారా కొత్త ఆఫర్ రాకపోవచ్చు. ఇలా కొన్ని కార్డుల ద్వారా ఆఫర్స్ తగ్గిపోవచ్చు. అందువల్ల ఎక్కువ కార్డులను కలిగి ఉండడం కంటే అవసరమైన కొన్ని కార్డులను వాడడం మంచిది.