https://oktelugu.com/

BP Control Tips: చలికాలంలో బీపీ పెరగడానికి కారణం ఇదే.. ఇలా చేస్తే నో ప్రాబ్లం..

చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వండే పదార్థాల కంటే బయట కనిపించే ఆహార పదార్థాలు రుచిగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో వేడిగా ఉండే ఆయిల్ పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 17, 2023 / 11:06 AM IST

    BP Control Tips

    Follow us on

    BP Control Tips: వర్షాకాలం తరువాత వాతవారణం చల్లబడుతుంది. దీంతో చల్లటి గాలులు వీస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. చలికాలంలో శరీరానికి అనేక ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు సంక్రమిస్తాయి. వీటితో పాటు బీపీ పెరుగుతుంది. సాధారణంగా చలికాలంలో అందరూ కూల్ గా ఉంటారని, ఈ సమయంలో బీపీ కంట్రోల్ ఉంటుందని భావిస్తారు. కానీ అనుకోకుండా ఈ సమయంలో కొన్ని ఆహర పదార్థాలు తినాల్సి వస్తుంది. దీంతో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఫలితంగా సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినా కొన్ని పాటించడం వల్ల సమస్యలను నివారించుకోవచ్చు.

    లికాలంలో రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే బయపడుతారు. కానీ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వండే పదార్థాల కంటే బయట కనిపించే ఆహార పదార్థాలు రుచిగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో వేడిగా ఉండే ఆయిల్ పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది. కొందరు భోజన ప్రియులు సాధారణ కాలాల కంటే చలికాలంలో కాస్త ఎక్కువ లాగించడానికి ట్రై చేస్తారు. అంతేకాకుండా వేడి వేడిగా ఉండే పదార్థాలు ఎంత తింటున్నామో తెలియకుడానే పొట్టలోకి వెళ్తుంది.

    వేసవి కాలంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దీంతో చెమట ద్వారా శరీరం అలసిపోయి తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది. కానీ శీతాకాలంలో మాత్రం చెమట తక్కువగా ఉంటుంది. దీంతో ఆహరం త్వరగా జీర్ణం కాదు. ఈ నేపథ్యంలో బయట లభించే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల డైజేషన్ సమస్యలు వస్తుంటాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. ఇలా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి బీపీ పెరిగే అవకాశం ఉంది.

    శీతాకాలంలో ఉదయం బయట అడుగుపెట్టాలంటే చాలా మంది ఇష్టం ఉండదు. దీంతో వ్యాయామం చేయడం మానేస్తారు. దీంతో శరీరం కదలిక లేక ఒత్తిడి పెరిగి క్రమంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అయితే ఈ బీపీ కంట్రోల్ కావాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. బయట తిళ్ల తక్కువ చేసి ఇంట్లోనే వండుకొని తినాలి. ఇక ఈ సమయంలో దాహం వేయదు. దీంతో నీరు తక్కువగా తాగుతూ ఉంటారు. ఫలితంగా బాడీ డీ హైడ్రేషన్ కు గురవుతుంది. అందువల్ల దాహం లేకపోయినా నీరు తాగుతూ ఉండాలి. అప్పుడే శరీరంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.