https://oktelugu.com/

Beer: బీర్ తాగే వారందరికీ ఇది షాకింగ్ న్యూస్..!

బ్రాందీ, విస్కీతో పోల్చితే బీర్‌ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని చాలా మంది భావిస్తుంటారు. కానీ బీర్‌లో కూడా ఆల్కహాల్‌ కంటెంట్‌ ఉంటుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 13, 2023 11:23 am
    Beer

    Beer

    Follow us on

    Beer: బీర్‌.. నేడు ఏ కార్యక్రమమైనా బీర్‌ ఉండాల్సిందే. ముఖ్యంగా యూత్‌ బీర్‌ లవర్స్‌గా మారుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా వీకెండ్‌ పార్టీల్లో బీర్లతో ఎంజాయ్‌ చేస్తున్నారు. బీర్లలో ఆల్కహాల్‌ శాతం తక్కువగా ఉంటుందని చాలా మంది పెద్దలు కూడా బీర్‌ తాగడాన్ని కామన్‌గా తీసుకుంటున్నారు. ఇక పోతే బీర్ల గురించి కేంబ్రిడ్జ్‌ శాస్త్రవేత్తలు ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. బీర్లపై గ్లోబల్‌వార్మిగ్‌ ప్రభావం పడుతోందని పరిశోధనలో గుర్తించారు. ఈమేరకు ఇటీవల పరిశోధన ఫలితాలను వెల్లడించారు.

    అందుకే టేస్ట్‌ మారుతోందట..
    ఇక కేంబ్రిడ్జి శాస్త్రవేత్తల పరిశధనల ఫలితాల ప్రకారం.. గ్లోబల్‌ వార్మిగ్‌ ప్రభావం వాతావరణంపైనే కాదు మనం తినే ఆహారంపైనా పడుతుందని తేలింది. గ్లోబల్‌వార్మింగ్‌ కారణంగా బీర్ల క్వాలిటీ, రుచి తగ్గుతోందని పరిశోధనల్లో నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా బీర్లకు రుచిని అందించే హోప్‌(హ్యూములస్‌ లుపులస్‌)మొక్కల్లో మార్పులు వస్తున్నట్లు తేచ్చారు. దీని ఫలితంగా సాగు కూడా తగ్గుతోందని పేర్కొన్నారు. వేసవిలో పరిస్థితి మరీదారుణంగా ఉంటోందంటున్నారు. రైతులు సాగులో నూతన పద్ధతులు అవలంబించాలని సూచిస్తున్నారు.

    అవయవాలపై ప్రభావం..
    బ్రాందీ, విస్కీతో పోల్చితే బీర్‌ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని చాలా మంది భావిస్తుంటారు. కానీ బీర్‌లో కూడా ఆల్కహాల్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇది బ్రాందీ, విస్కీల వలే ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాలేయం, మెదడుని ప్రభావితం చేస్తుంది. తాజాగా గ్లోబల్‌ వార్మిగ్‌ ప్రభావం కూడా బీర్లపై ఉన్నట్లుగానే వాటిని తాగేవారిపైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు.

    బీర్‌ శరీరానికి ఏమి చేస్తుంది?
    బీర్‌ తాగినప్పుడు అది నేరుగా చిన్న ప్రేగులలోకి వెళుతుంది. తర్వాత బీర్‌లో ఉన్న ఆల్కహాల్‌ రక్తంలో కలుస్తుంది. రక్తం దానిని శరీరంలోని ఇతర కణాలకు చేరవేస్తుంది. ఇక్కడ ఆల్కహాల్‌లోని పోషకాలు కరగకుండా అలాగే ఉంటాయి. తర్వాత ఇవి కాలేయానికి చేరుకుంటాయి. కాలేయం వీటిని ఫిల్టర్‌ చేసే పనిని ప్రారంభిస్తుంది. ఇంతలో ఆల్కహాల్‌ మెదడుకు చేరుకోవడంతో కొన్ని స్రవాలు విడుదల అవుతాయ. ఇవి మాట్లాడటం, నవ్వడం మొదలైన వాటిని నియంత్రిస్తాయి. అధిక బీర్‌ సేవించిన వ్యక్తి ఏదైనా మాట్లాడటం, ఏదైనా చేయడం ప్రారంభిస్తాడు. ప్రతీరోజు ఒకటి కంటే ఎక్కువ బీర్లు తాగుతున్న వ్యక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

    కాలేయంపై ప్రభావం..
    కాలేయంపై ఆల్కహాల్‌ అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కాలేయంలో కొవ్వు మొత్తం పెరిగి అది సరిగా పనిచేయలేకపోతుంది. ఆల్కహాల్‌ మానేసినప్పుడు లివర్‌ మళ్లీ రిపేర్‌ అవ్వడం మొదలవుతుంది. కాలేయ కణాలను ఏర్పాటు చేస్తుంది. కానీ కాలేయం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.