
Thyroid Problem: మనలో చాలా మందికి థైరాయిడ్ సమస్య ఉంటుంది. ఇది గొంతు దగ్గర సీతాకోక చిలుకలా ఉండే చిన్న భాగమే థైరాయిడ్ గ్రంథి. దీంతో సమస్యలు అనేకం కనిపిస్తాయి. ముఖ్యంగా థైరాయిడ్ లోపం ఉన్నట్లయితే బరువు పెరిగేందుకు కారణమవుతారు. మీ గొంతు బేస్ వద్ద కనిపించే థైరాయిడ్ గ్రంథి నియంత్రణ కేంద్రంగా ఉంటుంది. హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ముఖ్యమైన హార్మోన్లను స్రవిస్తుంి. టీ త్రీ, టీ4 లాంటి చిన్న సమర్థవంతమైన థైరాయిడ్ గ్రంథితో పనిచేస్తాయి. ఇది పుర్రె దిగువన మెదడు కింద పనిచేస్తుంది.
థైరాయిడ్ ఒకసారి వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సిందే అని ఫిక్సయిపోతుంటారు. కానీ థైరాయిడ్ గ్రంథిని కూడా తగ్గించుకోవచ్చు. మందులు లేకుండా కూడా థైరాయిడ్ ను దూరం చేసుకోవచ్చు. దీనికి గాను కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవి కూడా ఎక్కడో దొరికేవి కావు. మన పరిసరాల్లో లభించేదే. థైరాయిడ్ గ్రంథితో కమ్యూనికేట్ చేసి హార్మోన్లు విడుదల చేయాలో సూచిస్తుంది. హార్మోన్లలో సమతుల్యత తప్పినప్పుడు థైరాయిడ్ సమస్య పెరుగుతుంది.
మునగాకు మంచి పోషకాలు ఉన్న ఆహారం. దీన్ని పప్పులో వేసుకుని వండుకోవచ్చు. పచ్చడి తయారు చేసుకోవచ్చు. మునగాకును తరచుగా తీసుకుంటుంటే మనకు ఎన్నో లాభాలు ఇస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. థైరాయిడ్ సమస్య తగ్గించడానికి మునగాకు చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇందులో సిలినియం, జింక్ పుష్కలంగా ఉండటంతో పాటు విటమిన్ ఎ, ఈ, సి కూడా ఉన్నాయి. మునగ ఆకుల్లో ఉండే ప్రొటీన్లతో థైరాయిడ్ ను క్రమబద్ధీకరిస్తుంని చెబుతున్నారు. 15 రోజుల్లో థైరాయిడ్ సమస్యను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వాడి చూస్తే మనకు తెలుస్తుంది.

ఆకుల్లో మొదట మునగాకు తరువాత కరివేపాకును సూచిస్తుంటారు. ఇవి రెండింట్లో మన శరీరానికి పనికి వచ్చే ఎన్నో రకాల ప్రొటీన్లు దాగి ఉండటంతో మన ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. ఈ నేపథ్యంలో మునగాకును రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా మునగాకును వాడుకుని మన దేహానికి పనికి వచ్చే విధంగా మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుంటే మంచిది. మునగాకుతో పాటు వాటి కాయలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి.