https://oktelugu.com/

Best Cars: SUV వెర్షన్ లో 7 సీటర్ అద్భుతమైన కారు ఇదే.. నెక్సాన్, బ్రెజ్జాకు గట్టిపోటీ..

SUV వెర్షన్ అనగానే ఇప్పటి వరకు టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా పేర్లు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు వాటికి పోటీగా మరో కారు అలరిస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 17, 2023 / 09:01 AM IST

    Best Cars

    Follow us on

    Best Cars: కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు చాలా మంది ఎస్ యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. బలమైన ఇంజిన్ తో పాటు విశాలమైన స్పేస్ ను కలిగిన ఈ మోడల్ కార్లు మార్కెట్లో విపరీతంగా అమ్ముడు పోతున్నాయి. దీంతో కంపెనీలు సైతం ఎస్ యూవీల తరహాలోనే కంపెనీలు కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.SUV వెర్షన్ అనగానే ఇప్పటి వరకు టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా పేర్లు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు వాటికి పోటీగా మరో కారు అలరిస్తోంది. ధర, పీఛర్లు ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకుందామా..

    7 ఇంచెస్ టచ్ స్క్రీన్, ఇన్ఫో మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్ వంటి ఫీచర్లు కలిగిన ఈ కారు మహీంద్రా బొలెరో నియో. మహింద్రా కంపెనీ నుంచి ఎక్కువగా ఎస్ యూవీలే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. తాజాగా ఈ కంపెనీకి చెందిన బొలెరో నియో ఆకట్టుకునే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా ధర విషయంలోనూ మిగతా కార్ల కంటే తగ్గించి ఆఫర్లను పెట్టింది.

    ఈ మోడల్ 1.5 లీటర్ ఇంజను కలిగి ఉండి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో అమర్చి ఉంది. 100 బీహెచ్ పీ పవర్ ను, 260 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఎలాంటి రోడ్లపై నుంచైనా వెళ్లగలదు. ఇందులో మహీంద్రా బ్లూసెన్స్ కనెక్టివిటీ యాప్ అలరిస్తుంది. అలాగే డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి అలరిస్తున్నాయి.

    టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ రూ.11.50 లక్షలతో విక్రయిస్తున్నారు. కానీ ఇదే డీజిల్ వేరియంట్ మహీంద్రా బొలెరో నియోను 9. 63 లక్షలతో విక్రయిస్తున్నారు. డిజైన్, ఫీచర్ల అద్భుతంగా ఉన్నాయి. టాటా నెక్సాన్ 5 స్టార్ సేప్టీ రేటింగ్ తో బెస్ట్ మోడల్ అనిపించుకుంది. కానీ కొన్ని కుటుంబాలకు నెక్సాన్ సరిపోతుంది. ఇటువంటి తరుణంలో నెక్సాన్ కంటే బొలెరో బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.