https://oktelugu.com/

Thirumala: తిరుమలలో కుమారధార ఎక్కడుందో తెలుసా?

అవును తిరమల కొండలైన శేషచలంలో కుమారస్వామి సంచరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి తిరుమల గిరుల్లో కుమారస్వామి సంచరించి శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపసస్సు చేసి అక్కడున్న తీర్థంలో స్నానం చేశారట.

Written By:
  • Srinivas
  • , Updated On : February 26, 2024 / 04:28 PM IST

    Kujmaradhara

    Follow us on

    Thirumala: పరమ శివుడి కుమారుల్లో ఒకరు కుమార స్వామి. ఇతనినే సుబ్రహ్మణ్యస్వామి అని పిలుస్తారు. కుమార స్వామి చరిత్ర ప్రత్యేకంగా ఉంటుంది. పద్మ, వామన పురాణాల ప్రకారం కుమారస్వామి దేవలోకం సేనాధిపతిగా ఉంటారు. తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి శాపవిమోచనం కోసం శివుడి సూచన మేరకు శేషాచలం పర్వతాల్లో తపస్సు చేశారట. శేషాచలం అనగానే మీకు తిరుమల అని గుర్తుకు రావాలి. అవును తిరమల కొండలైన శేషచలంలో కుమారస్వామి సంచరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి తిరుమల గిరుల్లో కుమారస్వామి సంచరించి శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపసస్సు చేసి అక్కడున్న తీర్థంలో స్నానం చేశారట.ఈ నేపథ్యంలో ఆయన స్నానం చేసిన తీర్థాన్ని కుమార ధార అని పేరు పెట్టారు. తిరుమలలోని ఆ కుమారధార విశేషాల్లోకి వెళితే..

    తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఇటీవల కుమారధార తీర్థ ముక్కోటిని ఘనంగా నిర్వహించారు. పాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిరోజున కుమార తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు. ఈ పర్వదినాన భక్తులు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కతుందని కొందరు పండితులు చెబుతున్నారు. ఇక్కడ స్నానం చేసిన తరువాత భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ దర్శించాలని కోరుతున్నారు.

    మార్కండేయ పురాణాల ప్రకారం.. ఓ వృద్ధ బ్రాహ్మణుడు శేషాచం కొండల్లో సంచరిస్తూ ఉండేవారట. ఈ సమయంలో వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఈ వయసులో ఈ కొండల్లో ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. యాగాలు చేసి దైవాన్ని దర్శించుకోవాలని చెబుతాడట. ఈ క్రమంలో ఆ వృద్ధుడు కుమారధారలోని తీర్థంలో స్నానం చేసిన వెంటనే 16 ఏళ్ల యువకుడిలా మారిపోయాడట. దీంతో ఈ తీర్థానికి కుమారధార తీర్థం అని పేరు వచ్చిందని అంటారు.

    తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ కుమారధారకు వెళ్లి స్నానం చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుందని అంటున్నారు. ఈ క్ష్తేత్రంలో కాలంలో సంబంధం లేకుండా నిత్యం ధార ప్రవహిస్తూనే ఉంటుంది. శేషాచంల కొండల్లో ఉన్న ఈ కుమారధారకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు అనువుగా ఉన్నాయి. ప్రత్యేక వాహనం తీసుకొని వెళ్లడం ద్వారా దీనిని దర్శించుకోవచ్చని అంటున్నారు. అందువల్ల తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వెళ్లాలని అంటున్నారు.