https://oktelugu.com/

Foods: మతిమరుపు మాయమై బ్రెయిన్ షార్ప్ కావాలంటే వీటిని కచ్చితంగా తినాలి.. అవేంటంటే?

నేటి కాలంలో పెద్దలతో పాటు పిల్లల మెదడు చురుగ్గా ఉండాలి. చురుకైన మెదడుతోనే అన్నీ పనులు చేయగలుగుతారు. మెదడు అలా చురుగ్గా ఉండాలంటే కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం..

Written By:
  • Srinivas
  • , Updated On : October 30, 2023 5:30 pm
    Foods
    Follow us on

    Foods: కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతోంది. దీంతో అన్ని పనులు స్పీడ్ గా అయిపోతున్నాయి. వేగంగా అయ్యే పనుల వల్ల మెదడు పట్టు కోల్పోతోంది. దీంతో కొంత మందికి మతిమరుపు పెరిగిపోతుంది. ఈ సమస్య చిన్నవాళ్లలో కూడా ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే తగిన ఆహారం తీసుకోకపోవడంతో పాటు ఆహారానికి సరైన సమయం కేటాయించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఉరుకులు పరుగుల జీవితాలు గడిపేవారు రోజూ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వారి మెదడు మొద్దుబారిపోతుంది. అయితే నేటి కాలంలో పెద్దలతో పాటు పిల్లల మెదడు చురుగ్గా ఉండాలి. చురుకైన మెదడుతోనే అన్నీ పనులు చేయగలుగుతారు. మెదడు అలా చురుగ్గా ఉండాలంటే కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం..

    మార్కెట్లో నిత్యం కనిపించే టోమాటోలతో మెదడు చురుగ్గా ఉంటుందంటే ఎవరూ నమ్మరు. టోమాటోలో లైకోపీన్, బీటా కెరోటిన్ అనే యాంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రీరాడికల్స్ ను అడ్డుకుంటున్నట్లు కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇందులోని లేకోపిన్ మెదడులో ఇన్ ఫ్లమేషన్ కు కారణమయ్య జన్యువలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో మెదడు యాక్టివ్ గా మారుతుంది.టోమాటో ను కర్రీ రూపంలో తరుచుగా తీసుకున్నా మెదడుకు మేతలాగా పనిచేస్తుందని కొందరు పరిశోధకులు తెలుపుతున్నారు.

    సాధారణంగానే ఆకు కూరలు శరీరానికి మేలు చేస్తాయి. ఇవి మెదడు యాక్టివ్ ఉండడానికి కూడా కారణమవుతాయి. ఆకు కూలర్లో ముఖ్యంగా పాలకూర, క్యాబేజీల్లో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఇవి మెదడు యాక్టివ్ అయ్యేలా పనిచేస్తాయి. మన ప్రాంతంలో బ్రకోలీ ఇప్పుుడిప్పుడే ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది ఇంకా బ్రకోలీ లాభాల గురించి తెలియవు. ఇందులో విటమిన్ సి, కె, తోపాటు ప్లేవనాయిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. గ్లూకోసైనోలేల్స్ శరీరంలోకి వెళ్లాక ఐసోథయోసైనేట్స్ గా మారి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో నరాల క్షీణతను తగ్గిస్తాయి.

    డ్రైప్రూట్స్ లో వాల్ నట్స్ కూడా మెదడుకు మేతలాగా పనిచేస్తాయి. ఇందులో ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, పాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్ గా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సోయాకు చెందిన ఉత్పత్తులు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు ను మెరుగుపరుస్తుంది. సోయాలో డెయిడ్ జెయిన్, జెనిస్టీన్, పాలీఫినాల్స్ వంటివి మెదడు ఆరోగ్యంగా ఉ:డేలా చేస్తాయి. వీటితో పాటు బ్లాక్ బెర్రీలు మతిమరుపును తగ్గిస్తుందని చెబుతున్నారు.