https://oktelugu.com/

Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌.. ఈ సమయంలో తినకూడదు.. ఎందుకంటే!

ఇటీవల అంజీర్‌ పండ్లను, ఎండు అంజీర్‌ను క్కువగా తీసుకుంటున్నారు. ఇందులో పీచు పదార‍్థం చాలా ఎక్కువ. జీర్ణక్రియ సజావుగా జరిగేందుకు తోడ్పడుతుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 1, 2024 / 11:01 AM IST
    Follow us on

    Dry Fruits: డ్రై ఫ్రూట్స్‌ను నిత్యం తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగా, బలంగా ఉంటాం. వైద్యులు కూడా డ్రై ఫ్రూట్స్‌ నిత్యం తీసుకోవడం మంచిదని సూచిస్తారు. కరోనా కాలంలో వైరస్‌ బారిన పడినవారు డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకున్నారు. కరోనా తర్వాత హెల్త్‌ కాన్షియస్‌ పెరగడంతో డ్రై ఫ్రూట్స్‌ తీసుకునేవారు పెరిగారు. నిత్యం డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం ద్వారా శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటిని సరైన సమయంలో తీసుకుంటేనే మంచి ప్రయోజనాలు ఉంటాయి. తినకూడాని సమయాల్లో తినకూడాని పద్ధతిలో తింటే దుష్ఫ్రభావాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

    ఈ ఐదు ఖాళీ కడుపుతో తినకూడదు..
    చాలా మంది డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటారు. అయితే ఇది మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఉదయం పరగడుపున పండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, పీచు ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటే దుష్ఫ్రభావాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ ఐదు పండ్లను ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. అవేంటి, ఎందుకు తీసుకోకూడదో తెలుసుకుందాం.

    కిస్‌మిస్‌లు..
    పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ కిస్‌మిస్‌లను ఇష్టంగా తింటారు. అయితే వీటిని పరగడుపున తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలు వస్తాయి. షుగర్‌ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

    అంజీర్‌..
    ఇటీవల అంజీర్‌ పండ్లను, ఎండు అంజీర్‌ను క్కువగా తీసుకుంటున్నారు. ఇందులో పీచు పదార‍్థం చాలా ఎక్కువ. జీర్ణక్రియ సజావుగా జరిగేందుకు తోడ్పడుతుంది. విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఖాళీ పొట్టతో తింటే పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తుతాయి. సులభంగా జీర్ణం కావు.

    ఖర్జూరా…
    ఖర్జూరాలను కూడా ఖాళీ పొట్టతో అస్సలు తినకూడదు. రోజుకు నాలుగు లేదా ఐదు మాత్రమే తినాలి. వీటిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. తిన్న వెంటనే అది రక్తంలో కలుస్తుంది. ఎక్కువగా తింటే రక్తంలో షుగర్‌ లెవల్‌ ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది.

    బాదాం..
    కొవ్వులు అధికంగా ఉండే బాదాం పప్పులను కూడా పరగడుపున తీసుకోవడం మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. కొవ్వుల కారణంగా త్వరగా జీర్ణం కావని పేర్కొంటున్నారు.

    ఆల్‌బుఖార్‌..
    విరోచనకారిగా పేరున్న ఆల్‌బుఖార్‌ పండ్లలోనూ పీచు అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవి తింటే విరోచనాలు అవుతాయి. పరగడుపున తీసుకుంటే సమస్య ఎక్కువగా ఉంటుంది.

    నానబెట్టి తీసుకోవాలి..
    పుష్కలంగా ఫైబర్ ఉండే ఈ డ్రై ఫ్రూట్స్‌ను రాత్రి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు. లేదా ఇతర పండ్లతో కలిసి తీసుకోవాలని సూచిస్తున్నారు. డ్రైగా తీసుకుంటే మాత్రం సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయని పేర్కొంటున్నారు.