Travel Credit Cards : ఎక్కువగా ట్రావెల్ చేసేవారికి ఈ క్రెడిట్ కార్డులు బెస్ట్…

అయితే ఈ బెనిఫిట్స్ వచ్చే విధంగా కార్డు ను ముందే ఎంచుకోవాలి. రోడ్ ట్రిప్, విహార యాత్రలకు వెళ్లాలనుకునే వారికి సైతం ఈ కార్డులు ఎంతో ఉపయోగపడుతాయి.

Written By: NARESH, Updated On : January 8, 2024 1:56 pm
Follow us on

Travel Credit Cards : వస్తువుల కొనుగోలుకు నగదు సాయం చేస్తూ.. తక్కువ వడ్డీతో రుణం అందిస్తూ.. క్రెడిట్ కార్డులు అవసరానికి ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు ఆదాయం ఎక్కువగా ఉన్నవారు మాత్రమే క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు సామాన్యులు సైతం క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నారు. లావాదేవీలను బేస్ చేసుకొని చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులను తక్కువ ఆదాయం ఉన్నవారికీ జారీ చేస్తున్నాయి. అయితే కొందరు క్రెడిట్ కార్డులను మిస్ యూజ్ చేసుకుంటూ జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. కానీ ప్రణాళిక ప్రకారంగా ఉపయోగిస్తే క్రెడిట్ కార్డులు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా రివార్డులు కూడా ఇస్తాయి. అయితే మిగతా అవసరాల కంటే ట్రావెల్ చేసేవారికి క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉపయోగడుతాయి. అదెలాగంటే?

క్రెడిట్ కార్డులతో పలు అవసరాలు తీర్చుకోవచ్చు. ఇంట్లో అవసరం ఉండే వస్తువులతో పాటు టీవీలు, ఫ్రిజ్ లు కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డులపై ఆయా వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా రివార్డులు వస్తుంటాయి. అయితే ఎక్కువగా ట్రావెల్ చేసేవారికి క్రెడిట్ కార్డులు మరింతగా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణం చేసేవారికి ప్రత్యేకంగా ట్రావెల్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇవి టికెట్ బుక్ చేసుకునేటప్పటి నుంచి హోటల్ లో బస చేసేవరకు నగదు సాయం అందిస్తాయి.

ఈ క్రెడిట్ కార్డులను విమానయాన సంస్థలు,హోటళ్లు, ట్రావెల్ సంస్థలు కలిసి ప్రయాణికులకు అందిస్తారు. అయితే ఎక్కువగా ఆదాయం ఉన్నవారు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ ఖర్చు చేసేవారు వీటిని ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ ఎంత ఖర్చు పెడితే అంత రివార్డ్ ఇస్తారు. టికెట్ బుక్ చేసుకుటప్పుడు ట్రావెల్ సంస్థ నుంచి హోటల్ లో బస చేసిన సమయంలో క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉటాయి.

ఇవే కాకుండా ఈ కార్డులపై తక్కువ ఫారిన్ ఎక్చ్జేంజ్ మార్క్ ఆఫ్ ఫీజు, ప్రయాణ బీమా, చెక్ ఇన్ లగేజీ వంటి ఆఫర్స్ కూడా అందిస్తాయి. అయితే ఈ బెనిఫిట్స్ వచ్చే విధంగా కార్డు ను ముందే ఎంచుకోవాలి. రోడ్ ట్రిప్, విహార యాత్రలకు వెళ్లాలనుకునే వారికి సైతం ఈ కార్డులు ఎంతో ఉపయోగపడుతాయి.

అందుకే వివిధ బ్యాంకులు సపరేట్ గా ఇచ్చే ‘ట్రావెల్ క్రెడిట్ కార్డుల’ కోసం వెంటనే అప్లై చేసుకోండి.. ఈ ట్రావెల్ క్రెడిట్ కార్డులను ఐసీఐసీఐ, హెచ్.డీ.ఎఫ్.సీ, యాక్సెస్, ఎస్.బీఐ, వన్, హెచ్.డీఎఫ్.సీ ఫస్ట్ బ్యాంక్ లాంటి బడా బ్యాంకులు జారీ చేస్తున్నాయి. తీసుకొని విహరించండి..