Liver Damage: మానవ శరీరంలో ప్రతీ అవయవం ప్రధానమే. అవి ఆరోగ్యంగా ఉంటేనే రోజూవారీ పనులు సక్రమంగా చేయగలుగుతాం. శరీరంలోని ఏ ఒక్క అవయం దెబ్బతిన్నా ఆ ప్రభావం మిగతా వాటిపై పడుతుంది. అందుకే ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో నాణ్యత లోపం ఏర్పడితే అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వ్యాధులు రావడానికి ముందు శరీరంలోని కొన్ని పార్ట్స్ దెబ్బతింటాయి. వీటిలో కాలేయం ఒకటి. కాలేయం దెబ్బ తింటే జాండీస్ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అయితే కాలేయం దెబ్బతిన్నది అని తెలియడానికి ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే?
శరీరంలోని ప్రధాన గ్రంథి కాలేయం(లివర్). ఇది ఆరోగ్యంగా ఉంటేనే తిన్న ఆహారం త్వరగా జీర్ణమయి రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. ఫలితంగా వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారు. మనిషి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శుద్ధి చేసిన దానిని మిగతా అవయావాలకు పంపిస్తుంది. వ్యర్థాలను వేరే మార్గానికి నెట్టుతుంది. అందువల్ల లివర్ ఆరోగ్యంగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యతా లోపమైన ఆయిల్ వాడడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.అలాగే మద్యపానం ఎక్కువగా తీసుకునేవారి కాలేయం తొందరగా దెబ్బతినొచ్చు. ఎటువంటి బ్యాడ్ హాబిట్స్ లేకున్నా.. రోజూవారీ ఆహారంలో నాణ్యత లోపం ఉన్నా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా కూరల్లో వాడే ఆయిల్ నాసిరకం ఉంటే కాలేయం దెబ్బతింటుంది.
శరీరంలోని కాలేయం దెబ్బతిన్నది అని తెలియడానికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం బైల్ రూబిన్ అనే దానిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కాలేయంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతే బైల్ రూబిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కాలేయం డ్యామేజ్ అయినట్లు. ఈ తరుణంలో రీరంపై దద్దుర్లు వస్తాయి. ఇవి కొన్నిరోజుల పాటు మాయమై మళ్లీ వస్తుంటాయి. మూత్రం ఎల్లో కలర్లో చిక్కగా వస్తుంటుంది. కళ్లు పసుపు కలర్లోకి మారుతాయి. చర్మం కూడా కలర్ మారుతూ ఉంటుంది. కాలేయం సక్రమంగా లేనప్పుడు వాంతులు వస్తుంటాయి. కళ్లు తిరుగుతూ ఉంటాయి. శరీరంపై దెబ్బ తగిలినప్పుడు చర్మం కింద రక్త స్రావం అయినట్లు ఎర్రబడుతుంది.
కాలేయం దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండడం మంచిది. సగం ఉడికిన ఆహారాన్ని తినొద్దు. పూర్తిగా ఉడికి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్యాలకు ఎక్కువగా మెడిసిన్ తీసుకున్నా కాలేయంపై ప్రభావం పడుతుంది. అవసరమైన మేరకే మందులను వాడాలి.