https://oktelugu.com/

Heart Attack Symptoms: గుండెపోటు రావడానికి ముందు సంకేతాలు ఇవీ.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

గుండెపోటు రావడానికి సంకేతాల విషయంలో నిద్రలో అసౌకర్యాలు కలుగుతాయి. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కొందరికి రాత్రిగుండె బరువుగా ఉంటుంది. చాతీలో గుచ్చినట్లుగా ఉంటుంది. ఇంకా కొందరికి చాతిలో మంట వస్తుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలొస్తాయి. రెండు మూడు అంతస్తులు ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలా గుండెపోటు వచ్చే ముందు ఇలాంటివి కనిపిస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 14, 2023 / 10:44 AM IST

    Heart Attack

    Follow us on

    Heart Attack Symptoms: ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. మారుతున్న మన ఆహార అలవాట్లే మనకు గుండె జబ్బులను తెచ్చిపెడుతున్నాయి. ఆహారం తీసుకోవడంలో నియంత్రణ లేకపోవడం వల్ల గుండెపోటు చిన్న వయసులోనే వస్తోంది. దీంతో ఉన్నట్లుండి ప్రాణాలే పోతున్నాయి.

    జాగ్రత్తలు

    మనం ప్రతి దశలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటోంది. ఎందుకంటే మన ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఉన్నట్లుండి గుండెపోటు వస్తోంది. తింటూనే గుండె నొప్పితో కుప్పకూలుతున్నారు. మనం చేసే తప్పులే మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. కొన్ని సంకేతాలు మనకు గుండె పోటు వస్తుందని చెబుతుంటాయి. వాటిని మనం పట్టించుకోకపోతే ఇబ్బందులు రావడం సహజం.

    నిద్రలో అసౌకర్యాలు

    గుండెపోటు రావడానికి సంకేతాల విషయంలో నిద్రలో అసౌకర్యాలు కలుగుతాయి. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కొందరికి రాత్రిగుండె బరువుగా ఉంటుంది. చాతీలో గుచ్చినట్లుగా ఉంటుంది. ఇంకా కొందరికి చాతిలో మంట వస్తుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలొస్తాయి. రెండు మూడు అంతస్తులు ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలా గుండెపోటు వచ్చే ముందు ఇలాంటివి కనిపిస్తాయి.

    మంచి ఫలితాలు

    ఈ సమయంలో వైద్యుడిని సంప్రదిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వెంటనే చికిత్స తీసుకుంటే గుండెకు ఎలాంటి ముప్పు వాటిల్లదు. కానీ నిర్లక్ష్యంతో ఉంటే మాత్రం ఆస్పత్రికి వెళ్లడం మంచిది. తల తిరుగుతున్నా కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. గొంతులో నొప్పి ఉన్న అనుమానించాల్సిందే. ఇలా గుండెపోటు రావడానికి పలు సంకేతాలు వస్తుంటాయి.