Debts: డబ్బు అందరి దగ్గర ఒకే విధంగా ఉండదు. కొందరు దగ్గర తక్కువగాను.. మరికొందరి దగ్గర ఎక్కువగానే ఉంటుంది. అయితే రోజు అవసరాలు కాకుండా ఒక్కోసారి ప్రత్యేక అవసరాలకు డబ్బు ఎక్కువగా అవసరం పడుతుంది. దీంతో ఒకప్పుడు ఇతరుల వద్ద బాకీ అడిగేవారు. కానీ ఇప్పుడు బ్యాంకు నుంచి రుణం లేదా క్రెడిట్ కార్డుల నుంచి అప్పులు తీసుకుంటూ వాటిని తీరుస్తున్నారు. అయితే చిన్న చిన్న అప్పులు, రుణాలు తీరడానికి ఏడాది నుంచి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. కానీ కొన్ని అప్పులు తీరడానికి సంవత్సరాలే కాదు జీవితమే పడుతుంది. అలాంటి అప్పులు ఎన్నటికీ తీరవు. అవి తీరకనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎలాంటి అప్పులు తీరవు? ఎందుకలా జరుగుతుంది?
అత్యవసరం అయితేనే అప్పు చేయాలని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతారు. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది జీవనశైలి మారిపోయింది. కొందరు లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలని తమ దగ్గర ఉన్న ఆదాయం కంటే ఆధారంగా అప్పు తీసుకొని జల్సాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో పొరపాట్లు పడుతున్నారు. ఈ పెట్టుబడుల్లో చేసే పొరపాట్లు జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఆ పెట్టుబడుల్లో ప్రధానంగా ఇల్లు కొనుగోలు చేయడం.. కారు కొనుగోలు చేయడం ముఖ్యమైనవి.
కొంతమంది ఇల్లు కట్టుకోవాలని చాలా ఆరాటపడుతూ ఉంటారు. ఈ ఇంటిని నిర్మించుకోవడం కోసం తమ వద్ద ఉన్న ఆదాయాన్ని కంటే అదనంగా అప్పుచేసి భూమి కొనుగోలు చేయడం లేదా ఫ్లాట్ ను కొనుగోలు చేయడం వంటివి చేస్తారు. భూమిని కొనుగోలు చేసి తర్వాత ఇల్లు కట్టుకుందాం లే అంటే పర్వాలేదు.. ఎందుకంటే కొన్ని రోజుల వరకు ఆ భూమి విలువ పెరిగే అవకాశం ఉంది. లేదా తగ్గినా తగ్గవచ్చు. కానీ అపార్ట్మెంట్లో ప్లాట్ కొంటే మాత్రం ఖచ్చితంగా ఐదు సంవత్సరాల తర్వాత ఆ ఫ్లాట్ వేల్యూ తగ్గిపోతుంది. అయితే ఇలా చాలామంది అపార్ట్మెంట్లో కొనుగోలు చేసి అప్పులు తీరక అవస్థలు పడుతున్నారు.
ఒక వ్యక్తికి లక్ష రూపాయల ఆదాయం వస్తే.. పది సంవత్సరాల తర్వాత పది లక్షలు చేతిలో పట్టుకొని.. మరో 30 లక్షలు అప్పు చేసి మొత్తం 40 లక్షలతో అపార్ట్మెంట్ ప్లాట్ కొంటున్నారు. అయితే ఇంటి కోసం చేసే అప్పు పై వడ్డీ ముందే వసూలు చేస్తారని కొంతమందికి తెలియదు. ఆ తర్వాత మధ్యలో ఫ్రీ క్లోజ్ చేసినా కూడా ఇలాంటి లాభం ఉండదు. ఎందుకంటే అసలు మాత్రమే కట్టాల్సి వస్తుంది. ఇలా అప్పును 20 నుంచి 30 సంవత్సరాలు ఏర్పాటు చేసుకొని జీవితాంతం కడుతూ ఇబ్బందులు పడతారు.
మరి ఇల్లు ప్రతి ఒక్కరికి అవసరమే అన్న ప్రశ్న ఎదురవుతుంది. అయితే తమ వద్ద 80% ఆదాయం ఉండి 20% వరకు అప్పు చేస్తే పర్వాలేదు. కానీ 20% ఆదాయం ఉండి 80% అప్పు చేస్తే అప్పుడు ఎలాంటి లాభం ఉండదు. ఇదే డబ్బుతో మిగతా పెట్టుబడులు పెడితే ఐదు నుంచి పది రెట్లు రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇల్లు కచ్చితంగా అని అనుకునే వారు మాత్రం తమకు ఉన్న ఆదాయంలో చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేదా కొన్ని రోజుల వరకు వెయిట్ చేయడం మంచిది.