Negative Thoughts: ప్రతి ఒక వ్యక్తి మంచి జీవితాన్నే కోరుకుంటాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనుషుల్లో రకాలుగా మారుతారు. కొందరు మంచి పనులు చేస్తే.. మరికొందరు చెడుపనులనే అలవాట్లుగా మార్చుకుంటారు. చెడుపనులు చేయాలని అనిపించే ముందు వారి మనసులో నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. ఆ తరువాత వారు ఆ పనులు చేయాలని అనుకుంటారు. అయితే నేను మంచోన్ని అనడానికి పెద్ద సర్టిఫికెట్ అంటూ ఏదీ ఉండదు. మనం చేసే పనుల్లోనే మంచి, చెడులు ఉంటాయి. ముందుగా మన మనసులో నెగెటివ్ ఆలోచనలను కట్టిపెడితే చెడు పనులు చేయడానికి ఆస్కారం ఉండదు. అయితే కొందరు తమకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తారు. ఆ పనుల వల్ల నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి. ఫలితంగా వారు చెడ్డవారిగా పేరు తెచ్చుకుంటారు. అయితే ఏయే పనులు చేయడం వల్ల నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి?
చాలా మంది తాము చేసే పనులకన్నా ఎదుటివారు ఏం చేస్తున్నారనే ఆలోచనలే ఎక్కువగా పెట్టుకుంటారు. దీంతో ఎదుటివాళ్లు ఎలాగై,నా చెడిపోవాలనే ఉద్దేశంగా ఆలోచిస్తారు. ఆ క్రమంలో వీరు కొన్ని తప్పులు చేస్తారు. అలా చేయడం వల్ల రివర్స్ అవుతుంది. ఈ ఆలోచన రానీయకండి..ఈరోజుల్లో ఎక్కువ శాతం మంది ఫోన్లతోనే గడుపుతున్నారు. ప్రతీది తెలుసుకోవాలన్న ఉత్సాహంతో అన్ని వార్తలు చదువుతారు. ఫలితంగా ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడడం వల్ల మైండ్ క్రాషెష్ అవుతుంది. దీంతో డైవర్ట్ అయి చెడు ఆలోచనలు ప్రేరేపిస్తాయి.
ఉద్యోగం చేసేవారు, వ్యాపారస్తులే కాకుండా సాధారణ వ్యక్తులు సైతం ఏదో ఒక ఒత్తిడితో సతమతమవుతున్నారు. దీంతో నిద్రలేమి ఏర్పడుతుంది. నిద్రలేమి కారణంగా శరీరంపై ఒత్తిడి పెరిగి చెడు ఆలోచనలు వస్తుంటాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు హాయిగా నిద్రపోవడానికి ట్రై చేయండి.. కొందరికి బయట తిరగడం అస్సలు ఇష్టముండదు. ఒంటరిగా ఉండడం అలవాటు చసుకుంటారు. ఇలా ఒంటరిగా ఉండడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. అలాగే ఎక్కువ సేపు ఒకేచోట ఉండడం వల్లనూ ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్ల చాలా మందిలో ఆత్మన్యూనత భావం ఎక్కువ. ఇలా ఉండడం వల్ల తామే గొప్ప అని ఫీలవుతారు. ఈక్రమంలో ఎదుటివారు చేసే పనులను అస్సలు ఒప్పుకోరు. దీంతో బయటివారికి వ్యతిరేకంగా ఉంటూ చెడ్డ ఆలోచలనతో ఉంటారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్లనూ పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కువగా నెగెటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ గా థింక్ చేయండి..