India vs England 5th Test: టీ20 వరల్డ్ కప్ నుంచి టీంఇండియాకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వివాదాలు ఏర్పడడంతో పలు సీరీస్ లను భారత జట్టు కోల్పోతుంది. తాజాగా ఇంగ్లండ్ తో ఆడిన 5 టెస్టుల మ్యాచ్ ను కూడా చేజార్చుకుంది. అయితే ఈ ఓటమికి టీంఇండియాలోని కీలక సభ్యుల ఆటతీరే కారణమని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆస్ట్రేలియా తప్ప ఏ జట్టునైనా అలవోకగా గెలిచివచ్చీన టీం ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో ఓటమి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇంగ్లండ్ టెస్ట్ లో భారత్ ఓటమికి ప్రధానంగా టాప్ ఆర్డర్ విఫలం కావడమే అన్న చర్చ సాగుతోంది. ఓపెనర్ శుబ్ మన్ గిల్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ హనుమ విహారి, మిడిల్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్ దారుణంగా ఆడారు. వీరు వరుసగా 17-4, 20-11, 15-19 ల కౌంట్ చేయడం జట్టును ఆందోలనలోకి నెట్టింది. గతంలో ఓపెన్ గా రోహిత్ ఆడడంతో ఎంతో కొంత ఆదుకునేవారు. అలాగే కెఎల్ రాహుల్ కూడా జట్టుకు న్యాయం చేసేవారు. కానీ ఈ మ్యాచ్ లో శుబ్ మన్ గిల్ రెండు ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యాడు. ఇక మరో ఓపెనర్ పూజారా కూడా 13-66 తో తడబడిపోయాడు. అయితే ఈయన రెండో ఇన్నింగ్స్ లో పర్వాలేదనిపించాడు. అయితే ఓపెనర్లు కాస్త అటూ ఇటూ అయినా హనుమ విహారిపై ఆశలు ఉండేవి. కానీ అతను కూడా నిరాశపరిచాడు. అటు మిడిల్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్ బంతుల ధాటికి తట్టుకోలేకపోయాడు. దీంతో మిగతా సభ్యుల కూడా ఇదే దారి పట్టారు.
Also Read: Samantha: సీక్రెట్స్ : రూ.500 కోసం ఆ పని చేసిన సమంత.. ఇప్పుడు కోట్లు..
ఇక ఈ సీరీస్ లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత రెండు సిరీసుల్లో కోహ్లీ ఫాంలో లేకపోయినా అతన్ని ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. విరాట్ కేవలం 11-20తో మురిపించడంపై క్రికెట్ ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై ఓటమి చెందిన తరువాత కోహ్లీ అభిమానులు భారీగా తగ్గారు. ఇదే సమయంలో ఆయన జట్టులో కొనసాగడంపై ఆలోచించుకోవాలని అంటున్నారు. క్రికెట్ కెరీర్లో ఏ ఆటగాడైన ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. కానీ మరీ ఇన్ని ఇన్నింగ్స్ ల్లో విఫలమవ్వడం కోహ్లీ మాత్రమేనని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఇంగ్లండ్ జట్టు దూకుడును ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగుల భారీ లక్ష్యం ఉన్నా జట్టు సభ్యులు ఎక్కడా భయపడినట్లు కనిపించలేదు. భారీ స్కోరు ఉన్నా దూకుడుగా ఆడాలని నిర్ణయించింది. ఇదే దూకుడును రెండో ఇన్నింగ్స్ లో ప్రదర్శించడం ఆ జట్టుకు కలిసొచ్చింది. అయితే ఇంగ్లండ్ రథ సారధి బెన్ స్టోక్స్ తమ ఆటతీరు గురించి చెప్పాడు. కివీస్ లాగే ఇండియాపై కూడా దూకుడు కొనసాగిస్తామని చెప్పానన్నారు. కానీ టీమిండియా పట్టించుకోలేదని అన్నారు. అయితే ఇంగ్లండ్ జట్టులోని రూట్, బెయిర్ స్టో, స్టోక్స్ లాంటి కీలక ఆటగాళ్లతో ప్రతిఘటన ఎదురైనప్పుడు ఎలాంటి వ్యూహం వేయాలన్న ఆలోచన టీం ఇండియాలో కినిపించలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
Also Read:BJP vs TRS: అటు బీజేపీ..ఇటు టీఆర్ఎస్.. ఏం చేయబోతున్నాయి..?
[…] Also Read: India vs England 5th Test: ఇంగ్లండ్ పై టీం ఇండియా ఓటమి… […]
[…] Also Read: India vs England 5th Test: ఇంగ్లండ్ పై టీం ఇండియా ఓటమి… […]