Head Bath: ప్రతిరోజూ తలస్నానం చేస్తే వచ్చే సమస్యలు ఇవే..

జుట్టులో ఉండే దుమ్ము ధూళి పోవడానికి కొందరు రెగ్యులర్ గా తల స్నానం చేస్తారు. అయితే సాధారణ తలస్నానం కంటే ప్రతిరోజూ షాంపు పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.

Written By: Chai Muchhata, Updated On : November 29, 2023 3:23 pm

Head Bath

Follow us on

Head Bath: ఆరోగ్యంగా ఉండడానికి కొన్నిఅలవాట్లను తప్పనిసరి చేసుకోవాలి. ప్రధానంగా శరీరంలోని ప్రతి అవయం ఆరోగ్యంగా ఉండేందుకు తల నుంచి కాళ్ల వరకు అన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ తల స్నానం చేయడం వల్ల చుండ్రు తో పాటు జుట్టులో ఉండే దుమ్ము ధూళి పోతాయని చాలా మంది చెప్పారు. అయితే ప్రతిరోజూ తల స్నానం చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈమధ్య జుట్టు సమస్యలతో చాలా మంది రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. కానీ అవి జుట్టు సమస్యలు తొలగించాల్సిందిపోయి కొత్త రోగాలను తీసుకువస్తున్నాయి. అయితే ముందు జాగ్రత్తగా ప్రతిరోజూ తల స్నానం చేయకుండా ఉంటే కొన్ని సమస్యలకు దూరంగా ఉండొచ్చని అంటున్నారు. అసలు ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?

రెగ్యులర్ షాంపూ..
జుట్టులో ఉండే దుమ్ము ధూళి పోవడానికి కొందరు రెగ్యులర్ గా తల స్నానం చేస్తారు. అయితే సాధారణ తలస్నానం కంటే ప్రతిరోజూ షాంపు పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. దీంతో కురులు బలహీనంగా మారి ఊడిపోతుంటాయి. ఒకవేళ తప్పనిసరిగా ప్రతిరోజూ తలస్నానం చేసినా షాంపూ వాడకుండా ఉండడం మంచిది.

నేచురల్స్ ఆయిల్స్ తక్కువై..
రెగ్యులర్ గా తలస్నానం చేయడం వల్ల జుట్టులో ఉండే నేచులర్ ఆయిల్స్ తక్కువవుతుంది. దీంతో కురులు పొడిబారిపోతాయి. ఈ కారణంగా వెంట్రుకల్ డల్ గా కనిపిస్తాయి. ఇలాంటి సమస్యంలో కోంబ్ ను ఉపయోగిస్తే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

కలర్ మాయం..
ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల జుట్టుకు ఉండే సహజ రంగు తొలగిపోతుంది. దీంతో వెంట్రుకలు గ్రే కలర్లోకి మారుతాయి. కొందరు ఎక్కువగా షాంపు వాడడం వల్ల వైట్ హెయిర్స్ వస్తుంటాయి. వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు రావడంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అందువల్ల ప్రతిరోజూ స్నానం చేయకుండా ఉండండి.

అయితే ప్రతిరోజూ కాకుండా వారానికి రెండు సార్ల స్నానం చేయడం మంచిది. ప్రత్యేకంగా రెండు రోజులను కేటాయించి వారంలో ఆ రోజుల్లోనే తలస్నానం చేయడం వల్ల జుట్టుకు ఎలాంటి సమస్య ఉండదు. పైగా క్లీన్ ఉండి ఆరోగ్యకరంగా కనిపిస్తాయి.