
TATA IPL 2023 Changes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ ఎడిషన్ లో తొలిసారి అనేక మార్పులను తీసుకువచ్చారు. కీలక మార్పులు ప్రేక్షకులు మరింత ఉత్సాహంగా క్రికెట్ వీక్షించేలా చేయనున్నాయి. అసలు ఈ ఐపీఎల్ లో చేసిన మార్పులు ఏమిటి..? క్రీడాభిమానులు ఉత్సాహాన్ని రెట్టింపు ఎలా చేస్తాయి ఒకసారి చూసేద్దాం.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ సంరంభం ప్రారంభం కాబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది నుంచి ఐపీఎల్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సరికొత్త మార్పులతో.. క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించేలా ఏడాది ఐపీఎల్ సీజన్ సాగనుంది.
సొంత మైదానంలో ఏడు.. ప్రత్యర్థి మైదానంలో ఏడు మ్యాచులు..
ఐపీఎల్ లో ఈ సీజన్లో ప్రతి జట్టు గ్రూపు దశలో ఏడు మ్యాచ్ లను సొంత మైదానంలో ఆడాల్సి ఉంటుంది. మిగిలిన ఏడు మ్యాచ్ లను ప్రత్యర్థి మైదానంలో ఆడుతుంది. ఈ విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. సొంత మైదానంలో ఏడు మ్యాచ్ లు ఆడటం వలన ప్రతి జట్టుకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది.
ఇంపాక్ట్ ప్లేయర్ రంగంలోకి..
ఇక ఈ ఏడాది కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ ను మ్యాచ్ లో ఆడించే అవకాశాన్ని కల్పిస్తోంది ఈ సీజన్. ప్రతి జట్టు 11 మందితో పాటు మరో ప్లేయర్ను ప్రత్యామ్నాయ ఆటగాడిగా రంగంలోకి దించే అవకాశం ఉంది. ఈ విధానం వలన మెరుగైన ఆట తీరును కనబరిచేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే ఒక టీమ్ లో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఆడే అవకాశం ఉంది. తాజాగా తీసుకొచ్చిన విధానం వలన టాస్ వేయడానికి ముందే టీమ్ ను ప్రకటించాల్సిన అవసరం లేదు. దాసు వేసిన తర్వాత మ్యాచ్ ఆడే 11 మంది ప్లేయర్లతో పాటు మరో ఐదుగురు సబ్స్టిట్యూట్ ఫీల్డర్లను వివరాలు వెల్లడించే అవకాశం కల్పిస్తారు. దీనివల్ల టాసు అత్యంత కీలకము కానుంది. టాస్ గెలిచిన దానిని బట్టి ముందు బ్యాటింగ్ చేస్తే ఒకలా, తరువాత బ్యాటింగ్ చేయాల్సి వస్తే మరోలా టీమ్ ను మార్చుకునే సౌలభ్యం కలుగుతోంది.
స్లో ఓవర్ రేటు తో జరిమానా..
ఇక ఐపీఎల్ లో మరో సరికొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసే టీమ్ కు జరిమానాను విధిస్తున్నారు. ఈ జరిమానా ఎలా ఉంటుందంటే బౌలింగ్ టీమ్ కు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. జట్టు తమ నిర్ణీత సమయ పరిమితి 90 నిమిషాల్లోపు 20 ఓవర్ల కోటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఆ జట్టు జరిమానా భరించాల్సి ఉంటుంది. స్లో ఓవర్ రేట్ విషయంలో బౌలింగ్ జట్టు చేనేత సమయంలో పూర్తికాని ప్రతి ఓవర్ కు 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంచాల్సి ఉంటుంది. దీనివల్ల బ్యాట్స్మెన్లు మరిన్ని ఎక్కువ పరుగులు చేసే అవకాశం కలుగుతుంది. ఇది ఒక రకంగా బౌలింగ్ టీమ్ కు ఇబ్బంది కలిగించే అంశమే.

వికెట్ కీపర్ కదలికలపైన పెనాల్టీ..
బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్ ఇష్టం వచ్చినట్లుగా కదిలిన బౌలింగ్ జట్టుకు పెనాల్టీ విధించనున్నారు. భోజనం చేసే సమయంలో కీపర్ కదిలినట్లయితే డెడ్ బాల్ గా ఇవ్వడంతో పాటు ఐదు పెనాల్టీ పరుగులను ఇవ్వనున్నారు. ఇది బౌలింగ్ జట్టుకు మరింత నష్టాన్ని కలిగించే వ్యవహారంగా మారనుంది. అనేక మార్పులతో, సరికొత్త నిబంధనలతో వస్తున్న ఈ 16వ ఐపీఎల్ మరింత ఉత్సాహాన్ని క్రికెట్ అభిమానులలో నింపనుంది