Top Selling Cars July: భారత ఆటోమోబైల్ మార్కెట్లో SUV కార్లు జోరందుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో హ్యాచ్ బ్యాక్ కార్లు సైతం తమ విక్రయాలను పెంచుకుంటూ పోతున్నాయి. 2023 జూలైలో మిగతా వాటికంటే హ్యాచ్ బ్యాక్ కార్లే ఎక్కువగా అమ్ముడు పోవడం విశేషం. కార్లు కొనాలనుకునే వారు SUVలు వద్దనుకేంటే బెస్ట్ ఆప్షన్ గా హ్యాచ్ బ్యాక్ కార్లపై మక్కవ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో మారుతి సుజుకి నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ హ్యాచ్ బ్యాక్ మోడల్ అనింటికంటే అత్యధికంగా మొదటి స్థానంలో నిలిచింది.ఈ కారు తరువాత మరెన్ని కార్లు అమ్ముడు పోయాయో చద్దాం..
మారుతి సుజుకీ స్విప్ట్ ఇప్పటికే ఫేమస్ అయిన మోడల్. స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ కార్లపై ఇటీవల మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2023 జూలై లో ఈ మోడల్ 17,896 యూనిట్లను విక్రయించింది. ఇదే నెల గత సంవత్సరంలో 17,539గా నమోదైంది. అంటే ఏడాదిలో 2 శాతం వృద్ది సాదించినట్లు తెలుస్తోంది. మారుతి కంపెనీకి చెందిన మరో మోడల్ ‘బాలెనో’ 16,725 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మోడల్ ఏడాదిలో 7 శాతం క్షీణించింది. మారుతి వాగనార్ సైతం జూలై 2023లో 12,970 విక్రయాలు జరుపుకుంది. ఇదే మోడల్ 2022లో 22,588 అమ్ముడుపోయాయాయి. అంటే వార్షికంలో 43 శాతం క్షీణించింది.
టాటా కంపెనికి చెందిన టియాగో విషయానికొస్తే 2023 జూలై లో 8982 యూనిట్లు విక్రయించింది. ఇదే మోడల్ ఇదే నెలలో గత ఏడాది 6159 యూనిట్లు అమ్ముడుపోయాయి. వార్షిక సేల్స్ ప్రకారం 46 శాతం పెరిగింది. టాటా కంపనీకి చెందిన మరో మోడల్ అల్ట్రోజ్ 7817 యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ మోడల్ 38 శాతం వృద్ధిలో ఉంది. ఇవే కాకుండా మారుతి నుంచి ఆల్టో 7099 యూనిట్లు హ్యూందాయ్ ఐ 10 5001 యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే మొత్తంగా మారుతి మోడల్స్ విక్రయాలు అత్యధికంగా ఉండడం విశేషం.