Animals : ఎగిరే ఉడుతల నుంచి యాంగ్లర్ ఫిష్ వరకు, జంతు రాజ్యం చీకటిలో మెరుస్తున్న మనోహరమైన జీవులతో నిండి ఉంటుందట. తమ శరీరంలో రసాయన చర్య ద్వారా తమ స్వంత కాంతిని ఉత్పత్తి చేసే జంతువులను బయోలుమినిసెంట్ జంతువులు అంటారు. మరి ఇలా చీకటిలో మెరుస్తున్న ఓ ఐదు జంతువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎగిరే ఉడుతలు: దాని బొచ్చులోని ఫ్లోరోసెంట్ పిగ్మెంట్ల కారణంగా అతినీలలోహిత కాంతి కింద చీకటిలో మెరుస్తుంటాయి. నార్త్ ఫ్లయింగ్ స్క్విరెల్ గ్లాకోమిస్ జాతికి చెందిన మూడు జాతులలో ఒకటి ఈ ఎగిరే ఉడుత. ఇవి ఉత్తర అమెరికాలో ఎక్కువ కనిపిస్తాయి. కానీ కెనడాలోని చాలా వరకు శంఖాకార, మిశ్రమ శంఖాకార అడవులలో అలస్కా నుంచి నోవా స్కోటియా వరకు, దక్షిణాన ఉత్తర కరోలినా పర్వతాలు, పశ్చిమాన యునైటెడ్ స్టేట్స్‌లోని ఉటా వరకు ఇవి కనిపిస్తుంటాయి.
ఆంగ్లర్ ఫిష్: ఇవి తమ శరీరంలోని ప్రత్యేక కాంతి అవయవాలలో నివసించే చిన్న సూక్ష్మజీవుల నుండి వారి మెరుపును పొందుతుంది
మిణుగురు పురుగులు: ఇవి పచ్చని-నారింజ రంగులో ఉండే బీటిల్స్. ఇవి సహచరులను ఆకర్షించడానికి రాత్రి సమయంలో వెలుతురును విడుదల చేస్తుంటాయి. సినిమాల్లో కొన్ని వందల మినుగురు పురుగులు ఒకే చోట ఉంటే ఆ దృష్యం చూడటానికి ఎంత బాగుంటుంది కదా. కానీ చీకట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక మినుగురు పురుగు ఉన్నా సరే భయపడుతుంటారు.
తుమ్మెదలు: తుమ్మెద, ఆహార తుమ్మెద. ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద. అంటూ పాటలు విన్నారు. పాడుకున్నారు కదా. నిజంగా ఈ తుమ్మెదలు కూడా తుంటరివే. అదేనండి మెరుస్తూ తుంటరిగానే కనిపిస్తాయి. అంటే ఈ తుమ్మెదలు చీకటిలో మెరుస్తాయి. ఎందుకంటే అవి లూసిఫెరిన్ అనే రసాయనం కారణంగా వాటి పొత్తికడుపులో తేలికపాటి ప్రత్యేక అవయవాలను ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ కారణంగా అవి చీకట్లో మెరుస్తాయి.
లాంతరు సొరచేపలు: ఫోటోఫోర్స్ అనే పేరున్న ఈ సోరచేపలు బయోలుమినిసెంట్ అవయవాలను కలిగి ఉంటాయి. అవి వాటి పొట్టను, వాటి రెక్కల దిగువ భాగంలో వెలుతురు వచ్చేలా చేసే గుణాన్ని కలిగి ఉన్నాయి.