https://oktelugu.com/

Anemia: రక్తహీనతను దూరం చేసే 5 రకాల పండ్లు ఇవే!

రక్త హీనత సమస్య నుంచి బయటపడాలంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. రక్తహీనత సమస్య లేకుండా శరీరంలో రక్తం పెరగాలంటే తప్పకుండా డైట్‌లో 5 రకాల పండ్లు యాడ్ చేసుకోవాలి. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 30, 2024 6:15 pm
    Pomegranate

    Pomegranate

    Follow us on

    Anemia: నేటి బిజీ లైఫ్‌లో పోషకాలు ఉండే ఫుడ్ తినడానికి కూడా కొందరికి సమయం లేదు. వ్యక్తిగత కారణాలు, ఆఫీస్ వర్క్‌లో చాలా బిజీగా ఉంటున్నారు. దీనివల్ల కనీసం ఆహార విషయంలో అసలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు ఉండే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో బ్లడ్ తగ్గిపోతుంది. దీంతో ఎక్కువ మంది రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రక్తం లేకపోతే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు మరణం కూడా సంభవించే ప్రమాదం కూడా ఉంది. అయితే రక్త హీనత సమస్య నుంచి బయటపడాలంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. రక్తహీనత సమస్య లేకుండా శరీరంలో రక్తం పెరగాలంటే తప్పకుండా డైట్‌లో 5 రకాల పండ్లు యాడ్ చేసుకోవాలి. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    దానిమ్మ పండ్లు
    రక్తాన్ని తొందరగా పెంచడంలో దానిమ్మ పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఉపయోగపడతాయి. డైలీ తప్పకుండా ఒక దానిమ్మ పండు తినడం వల్ల రక్తం పెరుగుతుంది. దీనివల్ల శరీరంలోని రక్తహీనత సమస్య ఉన్న మటాష్ అయిపోతుంది. దానిమ్మ పండు తినడం ఇష్టం లేకపోతే దీన్ని జ్యూస్ చేసుకుని అయిన తాగండి. ఇలా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

    నారింజ పండ్లు
    నారింజ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణమే శక్తిని ఇవ్వడంతో పాటు రక్తాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్త కణాలను మెరుగుపరుస్తుంది. రోజూ నారింజ పండ్లు తినడం వల్ల శరీరంలో ఉన్న రక్తహీనత వెంటనే తొలగి.. ఆరోగ్యంగా ఉంటారు. విటమిన్ సి వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. డైలీ వీటిని తినడం వల్ల కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

    యాపిల్ పండ్లు
    రోజుకి ఒక యాపిల్ పండ్లు తింటే అసలు డాక్టర్ అవసరమే లేదని అంటుంటారు. డైలీ ఒక యాపిల్ తింటే తప్పకుండా రక్తహీనత సమస్య నుంచి విముక్తి చెందుతారు. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని తొందరగా పెంచుతాయి. దీన్ని డైరెక్ట్‌గా తినవచ్చు. లేకపోతే జ్యూస్ చేసుకుని అయిన కూడా తాగవచ్చు.

    బొప్పాయి
    బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఐరన్‌ను పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు రక్తం ఏర్పడటానికి సహాయపడతాయి. బొప్పాయి పండు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులతో తొందరగా బ్లడ్ ఏర్పడుతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.