Breakfast: అత్యధిక మనం రోజూ ఎన్నో రకాల ఆహారాన్ని తింటాం. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎన్ని కేలరీల శక్తి వస్తుందో తెలియదు. కానీ కడుపు నిండినట్లు అవుతుంది. కానీ ఆ తరువాత తిన్న ఆహారంవెంటనే జీర్ణం కావడంతో అలసట వస్తుంది. కాస్త ఎక్కువ తింటే బరువుపెరిగే సమస్యఉంది.అయితే తక్కువఆహారాన్ని తీసుకున్నా ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటనే అవసరమైన శక్తి శరీరానికి లభిస్తుంది. ముఖ్యంగా ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లే సమయంలో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. వీటిలో 17 రకాల ప్రోటీన్ ఆహారాల గురించి తెలుసుకుందాం..
1. టోపు స్క్రాంబుల్:
స్క్రాంబుల్ టోపు వంటకాన్ని తయారు చేయడానికి బ్రెడ్డును ముక్కలు చేయాలి. ఇందులో ఇష్టమైన కూరగాయలు వేయించి అవసరమైనంత ఉప్పు, నల్ల మిరియాలు, ఎర్ర మిరపకాయాలు వేసుకోవచ్చు. ఈ డిష్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.
2. గ్రీక్ యోగర్ట్ పర్ఫేట్:
గ్రీక్ పెరుగు భారతదేశంలోని శాఖాహారులకు అధిక ప్రోటీన్ ఇచ్చే పదార్థం. పెరుగులో స్ట్రాబెర్రీ, చియా గింజలువేసుకొని తినడం వల్ల అధిక శక్తి వస్తుంది.
3. చిక్ పా పిండి పాన్ కేక్:
చిక్ పా పిండిలో కాస్త నీరు పోసి అందులో నచ్చిన కూరగాయాలు వేసి కలపాలి. ఆ తరువాత నూనెలో వేయించుకోవాలి. వీటిని గ్రీన్ చట్నీతో కలిపి తింటే రుచిగానూ ఉండి అధిక ప్రోటీన్లను అందిస్తుంది.
4. ప్రోటీన్ ప్యాక్డ్ స్మూతీ:
ఉదయమే వేగంగా ఆహార తయారు చేసుకోవడానికి ప్రోటీన్ ప్యాక్డ్ స్మూతీ బెస్ట్ రెసిపీ. గ్రీక్ పెరుగు, బచ్చలి కూర, అరటిపండు, ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ ను కలిపి దీనిని తయారు చేసుకోవచ్చు.
5. క్వినోనా పొరిడే:
బాదంల పాలలో క్వినోనాను ఉడికించాలి. ఆ తరువాత మాపుల్ సిరప్ చినుకులు వేయాలి. ఇది కడుపు నిండినట్లు అవడమే కాకుండా మంచి ప్రోటీన్ ను అందిస్తుంది.
6. వితౌట్ ఎగ్ ఆమ్లేట్:
ఆమ్లేట్ అనగానే ఎగ్ అని అనుకుంటారు. కానీచిక్ పా పిండితో ప్రోటీన్ రిచ్ ఎగ్ లెస్ ఆమ్లేట్ తయారు చేసుకోవచ్చు. చిక్ పా పిండి, పసుపు, వివిధ కూరగాయాలను కలిపి ఆమ్లేట్ వేసుకోవచ్చు.
7. పీనట్ బటర్ ఓవర్నైట్ ఓట్స్:
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన బ్రేక్ ఫాస్ట్ ఇది. రోల్డ్ వోట్స్ ను బాదం పాలు,చియాగింజలు, వేరుశెనగ వెన్నతో కలిపి తీసుకుంటే అమృతం తిన్న ఫీలింగ్ కలుగుతుంది.
8. వెజ్జీ బ్రేక్ ఫాస్ట్ బర్రిటో:
ఉడకబెట్టిన గుడ్లలో టోపును సాటెడ్ వెజిటేబుల్స్, జున్నుతో కలిసి టోర్జిల్లాలలో చుట్టి తినవచ్చు.
9. అవోకాడో టోస్ట్:
అవాకాడోలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. స్మార్ట్ ఆవోకాడో, తృణ ధాన్యాలతో కలిపి రోస్ట్ తయారు చేసి అందులో ఎగ్ వేసుకొని తింటే టేస్టీగాఉంటుంది.
10. కాటేజ్ చీజ్ బౌల్:
అల్పాహారం కోసం తయారు చేయగల సులభమైన ప్రోటీన్ ఇది. కాటేజ్ చీజ్ ను తేనేతో కలిపి ఇందులో కొన్ని గింజలు వేసుకొని తినొచ్చు.
11. హమ్మస్, వెజ్జీ ర్యాప్:
తృణ ధాన్యాలతోకలిపి తయారు చేసిన మిక్సర్ ను హమ్మస్ లో వేసుకొని తినొచ్చు.
12. బ్లాక్ బీన్ బ్రేక్ ఫాస్ట్:
సల్సా, ఆవోకాడో, గుడ్డు కలిపి సలాడ్ లా తయారు చేసుకొని తినాలి.
13. సోయా యోగర్ట్ పర్ఫెట్:
సాంప్రదాయ పెరుగులో సోయా వేసి బాగా కలపాలి. ఆ తరువాత వాటిపై కొన్ని పండ్లు వేసుకొని తినాలి.
14. చియా సీడ్ పుడ్డింగ్:
చియా గింజలను బాదం పాలతో కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్ని లేచి వీటిని తీసుకోవచ్చు.
15. ఎగ్ శాండ్ విచ్
బ్రెడ్ ను బేకింగ్ చేసి మధ్యలో ఎగ్ వేసుకొని తినడం వల్ల టేస్టీతో పాటో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది.
16. బచ్చలికూర,పెటా క్యూసాడిల్లా:
బచ్చలికూర, పెటా చీజ్, గుడ్డు కలిపి క్యూసాడిల్లాను తయారు చేసి తినొచ్చు.
17. టెంటిల్ మరియు వెజిటెబుల్ హాష్:
బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు, గుమ్మడికాయ వంటి వాటినిముకకలు చేసి కూరగాయలతో పప్పును వేయించాలి. వీటిని కలిపి తినాలి.