Wife Happy Tips: ఆలుమగల బంధంలో కలతలు మామూలే. కాపురం అన్నాక కయ్యాలు ఉంటాయి. అవి పొద్దున్నే వచ్చి సాయంత్రం పోయేలా ఉండాలి. అంతేకాని వాటినే పట్టుకుని అల్లిస్తే ఇబ్బందులొస్తాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల బంధంలో అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఉంటే ఎలాంటి కలతలు అయినా ఇట్టే వీగిపోతాయి. దీనికి ఇద్దరు సుముఖంగా ఉండాలి. లేకపోతే చిన్న గొడవే చిలికి చిలికి గాలివానగా మారుతుంది. దంపతుల మధ్య అలకలు, గొడవలు జరిగినప్పుడు వాటిని పెంచుకోవద్దు. అక్కడే తుంచేయాలి.
క్షమాపణ
గొడవ జరిగినప్పుడు దాన్ని పెంచుకోకుండా చూసుకోవాలి. తప్పెవరిది అయినా సారీ చెబితే గొడవ సమసిపోతుంది. క్షమాపణ చెప్పేందుకు ఇగోలకు పోకూడదు. నేనేమిటి క్షమాపణ చెప్పడమేమిటనే వాదన రాకూడదు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య అనవసర పట్టింపులు ఉంటే అది ఎక్కడికో దారి తీస్తుంది. ఇద్దరిలో సమన్వయం ఉండాలి.
బహుమతి
భార్య అలిగినప్పుడు ఏదైనా కొత్తగా బహుమతి ఇవ్వండి. దీంతో వారి కోపం చల్లారిపోతుంది. వారికి ఇష్టమైన బహుమతి ఇవ్వడంతో వారి కోపం శాంతిస్తుంది. లేకపోతే భార్య కోసం వంట చేయండి. ఇలా చేస్తే మాత్రం వారిలో కోపం ఉండదు. ఇంకా కోపం చల్లారకపోతే షాపింగ్ కు తీసుకెళ్లి వారికి ఇష్టమైనది కొనివ్వండి. దీంతో వారిలో ఉన్న కోపం మొత్తం పోతుంది.
తగ్గాలి
ఇద్దరిలో తగ్గే గుణం ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం ఉండకూడదు. అర్థం చేసుకుని తప్పులు జరిగినా గొడవలకు దిగకూడదు. ఇద్దరు అరమరికలు లేకుండా జీవించేందుకు మొగ్గు చూపాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది. ఆలుమగల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకుండా చూసుకోవడమే మంచిది.