Enjoy life: మంచి ఉద్యోగం ఉండాలి.. ఎప్పుడూ ఆదాయం పెరుగుతూ ఉండాలి..సమస్య లేని కుటుంబ జీవితం ఉండాలి.. అనుకున్న పనిలో విజయం సాధించాలి.. ఇలాంటి కోరికలు ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే ఒక వ్యక్తిలో అన్ని కోరికలు ఉండకపోయినా ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా ఉంటుంది. దానికోసం ఆ వ్యక్తి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. అయితే దీనిని సాధించుకోవడానికి ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. అలా సాధ్యం కాకపోవడానికి ప్రయత్నం లోపం కారణం కావచ్చు. అంటే మనం చేసే పనిలో లోపాలు ఉండడం వల్లే అనుకున్న సమయానికి అనుకున్న కోరికలను సాధించుకునే అవకాశం ఉండదు. మరి ఆ పనులు బాగుండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి జీవితం ఒకటే ఉంటుంది.. ఈ జీవితంలో అందంగా బతకాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి?
మంచి జీవితం… కావాలని అందరూ కోరుకుంటారు. కానీ అందుకోసం చేసే ప్రయత్నాల్లో కొందరు వివిధ దారులను ఎంచుకుంటారు. అయితే ఏ దారి ఎంచుకున్నాం అనేదే అసలైన విజయానికి తొలిమెట్టు. ఎందుకంటే ఒక దారి వెంట వెళ్లాలని నిర్ణయం తీసుకునే సమయంలో ఎన్నో ఆలోచనలు.. ఈ దారి సరైనదా? కాదా? పూర్తి వరకు చేరుతామా? అన్న ఆలోచనలు వస్తుంటాయి. అయితే ఒకసారి దారి వెంట వెళ్ళినప్పుడు ఒకసారి విఫలం కావచ్చు. ఈ విఫలమైన సందర్భంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతాయి. ఈ అనుభవాలతోనే తర్వాత ప్రారంభించే గారికి సరైన నిర్ణయాన్ని ఎంపిక చేస్తాయి. ఇలా ఓడిపోవడం తప్పు కాదు.. కానీ ప్రతిసారి ఓడిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఒకసారి ఓడిపోయిన తర్వాత మరోసారి ఓడిపోకుండా ఉండేందుకు చేసే ప్రయత్నమే అసలైన దారిని ఎంచుకోవడం.
ఒకసారి దారిని ఎంచుకున్న తర్వాత చివరి వరకు చేరే క్రమంలో కూడా ఎన్నో ఆటంకాలు.. ఎదురుదెబ్బలు.. అయినా కూడా ముందుకు వెళ్లాలని తపన కొందరికి మాత్రమే ఉంటుంది. మధ్యలోనే ఆగిపోవాలన్న నిరాశ ఇంకొందరికి ఉంటుంది. మరి ఈ రెండు రకాల వారిలో ముందుకు వెళ్లిన వారిదే విజయం అని చెప్పుకోవచ్చు. కానీ ఆ విజయం చేరడం అంతా ఆషామాసి కాదు. ఎంతో కష్టపడాలి.. ఎన్నో అవమానాలు భరించాలి.. అయినా సాధించాలన్న తపన మనసులో ఉంటే కచ్చితంగా విజయం దరి చేరుతుంది..
అప్పుడే అందమైన జీవితం అందుతుంది. పైన చెప్పిన కోరికల్లో ఏదో ఒకదానిని ఎంచుకున్న వారు ఈ విధంగా అన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్లిన వారే దాని ప్రతిఫలాలు పొందుతారు. అప్పుడు ఆనందమైన జీవితాన్ని పొందుతారు. కానీ చాలామంది చూద్దాంలే.. చేద్దాంలే.. అన్న నిరాశలో పడిపోతూ ఉంటారు. కానీ మేధావులు చెప్పే విషయం ఏంటంటే జీవితం ఒకసారి పోతే మళ్ళీ రాదు.. ఉన్న జీవితాన్ని ఆనందంగా నింపుకోవాలంటే కాస్త శ్రమతో పాటు ఆలోచన దృక్పథం మారాలి.. మనది కాదు.. మనం చేయలేం.. అన్న పదాలకు దూరంగా ఉండాలి.. కచ్చితంగా చేస్తాం.. అనుకున్నది సాధిస్తాం.. అన్న ఆలోచనతో ముందుకు వెళితే ఈ జీవితం స్వర్గం.