Telly TV: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ టెలివిజన్ పై ఇంట్రెస్ట్ తగ్గుతోంది. ఇప్పుడంతా మొబైల్ లోనే సీరియళ్లు, సినిమాలు చూసుకోవడం ద్వారా టీవీని దాదాపు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు టీవీ కంపెనీలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని కంపెనీలు టీవీలపై ధరలు తగ్గిస్తుండగా.. మరికొన్ని భారీ డిస్కౌంట్ తో విక్రయిస్తున్నాయి. లేటేస్టుగా ఓ కంపెనీ వినియోగదారులకు ఉచితంగా టీవీని అందిస్తోంది.ఈ టీవీ కావాలనుకునే తమ వివరాలను నమోదు చేసుకుంటే మొదటి 5 లక్షల మంది దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే కంపెనీ దీనికి ఓ నిబంధన పెట్టింది. ఆ టీవీల్లో వచ్చే యాడ్స్ చూస్తే చాలు.. దానిని దక్కించుకోవచ్చు.. మరెలాగో తెలుసుకోండి..
ఇప్పుడంతా స్మార్ట్ యుగం.. అందుకే టీవీలు కూడా స్మార్ట్ గా తయారవుతున్నాయి. కొత్త టీవీ కొనాలనుకునేవారికి ఆకర్షించే ఫీచర్లతో లభ్యమవుతున్నాయి. కేవలం టీవీలో వచ్చే కార్యక్రమాలే కాకుండా స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకొని మొబైల్ తో ఆపరేట్ చేసుకునే విధంగా అందుబాటులో ఉంచుతున్నారు. ఇలాంటి టీవీని సొంతం చేసుకోవాలంటే కనీసం రూ.10 నుంచి రూ.20 వేల వరకు ధరలు ఉన్నాయి. ఇంత ధర ఉన్న టీవీని ఉచితంగా ఇస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ‘టెలీ’ అనే కంపెనీ ఆ సాహసం చేస్తోంది.
కువైట్ కు చెందిన టెలీ అనే కంపెనీ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లూటో టీవీ వ్యవస్థాపకుడు ఇలియా ఫొజిన్ ఒక ప్రకటన ద్వారా ‘టెలి’ అనే డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ టీవీని ఉచితంగా పొందవచ్చని తెలిపాడు. ఈ టీవీ కావాలనుకునే మొదటి 5 లక్షల మందికి ఉచితంగా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నాడు. అయితే ఇదేదో 32 ఇంచెన్ టీవీ కాదు.. ఏకంగా 55 అంగుళాలు కలిగిన బిగ్ స్క్రీన్ టెలివిజన్. 4కెహెచ్ డీఆర్ థియేటర్ డిస్ ప్లే తో ఉన్న ఇందులో వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. 5 డ్రైవర్ ఇమ్మర్సివ్ సౌండ్ తో అలరిస్తుంది.
ఈ టీవీ దక్కించుకున్న తరువాత మీరో చిన్న పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో రెండు స్క్రీన్లు ఉంటాయి. పైన స్క్రీన్లో టీవీ కార్యక్రమాలు వస్తుంటాయి. కింది స్క్రీన్లో మాత్రం ప్రకటనలు ప్రసారం అవుతూ ఉంటాయి. అంటే మనకు టీవీల్లో వచ్చే కార్యక్రమాలకు మధ్య మధ్యలో వచ్చే అడ్వర్టయిజ్మెంట్స్ ఇందులో లైవ్ లో ప్రసారం అవుతూ ఉంటాయన్నమాట.ప్రస్తుతం ఈ ప్లాన్ అమెరికాలో ఉంది. త్వరలో ఇతర దేశాలకు విస్తరించాలని ‘టెలీ’ ప్లాన్ చేస్తోంది. మరి మనదేశంలోకి రాగానే వెంటనే బుక్ చేసుకోండి..