https://oktelugu.com/

Adani: అదానీ విదేశీ పెట్టుబడుల వెనుక ఉన్న కథ ఇదా?

అంతర్జాతీయంగా అదాని గ్రూపు సంస్థ దోషిగా నిలబడింది. గౌతమ్ అదాని తమ్ముడు వినోద్ అదా నీ ఈ మొత్తం తతంగాన్ని నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇద్దరు విదేశీయులైన తన కంపెనీలని డైరెక్టర్లతో విదేశీ పెట్టుబడులను ప్రవహింప చేశారన్నది ఈ ఆరోపణల సారాంశం.

Written By:
  • Dharma
  • , Updated On : September 1, 2023 / 04:24 PM IST

    Adani

    Follow us on

    Adani: వైసీపీ సర్కార్ అదాని కంపెనీకి పెద్దపీట వేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు రాద్ధాంతం చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక తన మనసును మార్చుకున్నారు. ఏపీ తీర ప్రాంతంలో పోర్టుల నిర్మాణాన్ని సైతం ఆ కంపెనీకే కట్టబెట్టారు. ఎన్ని రకాల విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. అటు దేశంలోని మోడీ సర్కార్ సైతం అదాని సంస్థకు పెద్దపీట వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు విపక్షాలు ఇదే తన ఆరోపణలు చేస్తున్నా మోడీ సర్కార్ నమ్మకు నీరెత్తడం లేదు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడాబలుక్కొని పెద్దపీట వేస్తున్న అదాని గ్రూపు సంస్థల బండారం ఇటీవల బయటపడింది.

    ప్రస్తుతం దేశ దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో పొలిటికల్ సపోర్ట్ ఉన్నది అదాని గ్రూపునకే. అదే సమయంలో ఏ పారిశ్రామిక సంస్థ పై రానటువంటి ఆరోపణలు అదాని గ్రూపు పై వస్తున్నాయి. గతంలో హిందెన్బర్గ్ రిపోర్టు బయట పెట్టిన విషయాలను అవాస్తవాలని అదాని గ్రూపు నిరూపించుకోలేకపోయింది. సెబీ తో దర్యాప్తు పేరుతో బండి నడిపించేస్తున్నారు. కానీ తాజాగా మరో అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ సంస్థ అదాని గ్రూపు పై సంచలన ఆరోపణలు చేసింది. ఇండియా నుంచి బిలియన్ డాలర్లను బయటకు తరలించి వాటినే విదేశీ పెట్టుబడులుగా చూపిస్తోందని తేటతెల్లమయింది.

    అంతర్జాతీయంగా అదాని గ్రూపు సంస్థ దోషిగా నిలబడింది. గౌతమ్ అదాని తమ్ముడు వినోద్ అదా నీ ఈ మొత్తం తతంగాన్ని నడిపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇద్దరు విదేశీయులైన తన కంపెనీలని డైరెక్టర్లతో విదేశీ పెట్టుబడులను ప్రవహింప చేశారన్నది ఈ ఆరోపణల సారాంశం.

    అయితే ఇదే అదాని సంస్థకు భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేయడం విశేషం. పోర్టులు, ఎయిర్పోర్టులతో సహా అనేక ఆస్తులు అదానీ కొనుగోలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ ఆరోపణలు సత్యదూరమని అదాని సంస్థ చెప్పుకొస్తోంది. గతంలో హిడెన్బర్గ్ చేసిన ఆరోపణలే మరోసారి తెరపైకి వచ్చాయని లైట్ తీసుకుంది. అట్టు కేంద్ర ప్రభుత్వం సైతం అదాని సంస్థ పై వస్తున్న ఆరోపణలను పట్టించుకోవడం లేదు. మసి పూసి మారేడు కాయ కథ చందంగా ఆరోపణలకు తరలించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.