Snoring Remedies: గుర‌క సమస్యా ? అయితే ఈ చిట్కాలతో చిటికెలో పరిష్కారం !

Snoring Remedies: గుర‌క ఎందుకు వ‌స్తుంది అంటే.. నిద్ర పోతున్న సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తూ ఉంటుంది. పైగా ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. గాలి వెళ్లాల్సిన మార్గంలో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురక చప్పుళ్లు వస్తాయి. అయితే, గురక రావడానికి ఈ ఒక్క కారణం మాత్రమే ఎప్పటికీ కారణం కాదు. వాస్తవానికి గురకకు మరెన్నో కారణాలు […]

Written By: Raghava Rao Gara, Updated On : January 12, 2022 11:37 am
Follow us on

Snoring Remedies: గుర‌క ఎందుకు వ‌స్తుంది అంటే.. నిద్ర పోతున్న సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తూ ఉంటుంది. పైగా ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. గాలి వెళ్లాల్సిన మార్గంలో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురక చప్పుళ్లు వస్తాయి. అయితే, గురక రావడానికి ఈ ఒక్క కారణం మాత్రమే ఎప్పటికీ కారణం కాదు.

Snoring Remedies

వాస్తవానికి గురకకు మరెన్నో కారణాలు ఉంటాయి. అలాగే మరెన్నో అంశాలు దోహదం చేస్తాయి. అయితే, ప్ర‌ధాన కార‌ణం మాత్రం మానసికపరమైన ఒత్తిడి, అలాగే విపరీతమైన కంగారు, అన్నింటికి మించి విపరీతమైన ఆలోచనా ధోరణిని కలిగి ఉండటం.

మరి ఈ గుర‌క స‌మ‌స్య‌ను ఎలా అధికమించాలి ? ఏమైనా అద్భుతమైన చిట్కాలు ఉన్నాయా ? ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాం.

ప్ర‌తిరోజూ రాత్రి మీరు నిద్ర‌పోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తీసుకుని తింటే, ఇక గురక రాదు. వచ్చినా కంట్రోల్ అవుతుంది.

అలాగే, అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగండి. అప్పుడు కూడా గురక రాదు. దీని వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇక, ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించండి. మీ గురక మాయం అవుతుంది.

Also Read: కంటి చూపు సమస్యలు వేధిస్తున్నాయా.. చెక్ పెట్టే చిట్కాలివే?

మరో చిట్కా ఏమిటంటే.. కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది.

అదే విధంగా, ఒక గ్లాసు వేడి నీటిలో అరటీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగండి. . దీని వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక మరో చిట్కా, రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టినా గురక రాదు. పైగా నిద్ర‌పోయాక మంచి నిద్ర పడుతుంది. ఇలాంటి ఎన్నో చిట్కాలను పాటించి మనం మన గురకను చక్కగా తగ్గించుకోవచ్చు.

Also Read: మేఘాలు ఎంత బరువు ఉంటాయి.. వాటిని ఎలా లెక్కిస్తారో తెలుసా?

Tags