Life lessons about pain: కొందరు తమ కష్టాల గురించి ఇతరులకు చెబుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో పక్క వారిలో కొందరు హేళన చేస్తూ ఉంటారు.. మరికొందరు సింపతి చూపిస్తుంటారు.. కానీ ఎవరూ మాత్రం ఒకరి కష్టాన్ని మరొకరు తీర్చే సాయం చేయరు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో స్వార్థం ఎక్కువగా పెరిగిపోతుంది. ఎవరికి వారే జీవితం అన్నట్లుగా మారిపోతుంది. అయితే ఒక్కోసారి దగ్గరి బంధువులు తమ కష్టాన్ని చెబుతున్నప్పుడు వినే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు పడే బాధను కొంచమైనా అర్థం చేసుకుంటే ఎదుటివారికి సాయం చేసినట్లు అవుతుంది. అలాకాకుండా హేళన చేస్తే.. అప్పుడు వారు ఒక మాట అంటారు.. దెబ్బ తినే వాడికే తెలుస్తుంది ఆ బాధ అని.. అసలు ఈ మాట గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
ఇనుము, బంగారం లోహాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇనుము కంటే బంగారం ఎక్కువ విలువను కలిగి ఉంటుంది. అయితే ఇనుము అయినా… బంగారం అయినా.. సుత్తి దెబ్బకు నలగాల్సిందే. ఏ లోహం అయినా ఉపయోగం లోకి రావాలంటే సుత్తి కింద దెబ్బలు తిని ఒక రూపం తెచ్చుకోవాల్సిందే. అయితే ఈ సమయంలో బంగారం ను సుత్తితో కొడితే ఎలాంటి శబ్దం రాదు. కానీ ఇనుమును కొడితే మాత్రం భయంకర శబ్దం వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అని.. ఒకసారి బంగారం వెళ్లి ఇనుమును అడుగుతుంది.. అప్పుడు ఇనుము ఏం చెబుతుందంటే.. నీవు బంగారం.. నేను ఇనుము.. మనల్ని కొట్టే పరికరం ఇనుము.. అయితే బంగారంనకు, ఇనుము కలిగిన సుత్తికి సంబంధం లేదు. కానీ నేను సుత్తి ఒకే జాతి వాళ్ళం అని ఇనుము అంటుంది. అంటే పక్కనే ఉండే వాడే మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని ఇనుము బంగారంతో అంటుంది.
అలాగే మనుషుల్లో కూడా చాలావరకు దూరపు వారి కంటే దగ్గరి వాళ్ళే ఎక్కువగా మోసం చేస్తారని అంటూ ఉంటారు. సమాజంలో మంచివారు, చెడ్డవారు ఇద్దరూ ఉంటారు. కానీ మంచివారు ఎవరు? చెడ్డవారు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన గురించి తెలిసినా మన పక్కవారే ఎప్పటికైనా మోసం చేసే అవకాశం ఉంటుంది. కొత్తవారు మన గురించి తెలుసుకునే వారికి సమయం పడుతుంది. ఆ సమయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ పక్క వారు మాత్రం ఎప్పటికీ మన వెంటే ఉంటూ వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఆ బాధ అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది అని పై స్టోరీ తెలుపుతుంది.
అందువల్ల ఎవరిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. అయితే నమ్మకం అనే దానిపై జీవితం సాగుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం దగ్గర వారిని నమ్మవచ్చు.. వారి ప్రవర్తనలో తేడా ఉంటే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఒక పెద్ద తప్పు జరిగే ముందు చిన్న తప్పు కచ్చితంగా జరుగుతుంది. అప్పుడే జాగ్రత్త పడితే పెద్ద తప్పు నుంచి బయటపడవచ్చు.