mountain fell : నదులు, పర్వత ప్రాంతాల వద్ద జీవించడం ఎంత భయంకరంగా ఉంటుందో అంతే సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. నదుల ఉపధృవాలు, పర్వతాల నుంచి రాల్లు, చెట్లు పడటం వంటి భయాలు ఉన్నా కూడా వాటి సోయగాలు చూస్తే ఆనంద పడాల్సిందే. ప్రకృతి ఒడిలో బతికే వీరు మిగిలిన వారి కంటే సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. కానీ ఆ ప్రకృతి విలయాల వల్ల ఇక్కడ నివసించడానికి భయపడుతుంటారు ప్రజలు. ఏ సమయంలో ఎలా ముప్పు వచ్చి పడుతుందో అనే భయం ఎక్కువ ఉంటుంది. అదే విధంగా కూడా వారు బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ ఊరి వాళ్లకూ అదే భయం. పర్వతానికి దగ్గర్లో ఉండే ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఉత్పాతాలు చూశారట. మళ్లీ ఏది తమ మీదకు వచ్చి పడుతుందో అనే భయం వారిలో నిండి పోయింది. కానీ ఈసారి వాళ్లకు దురదృష్టం కాదు అదృష్టం వచ్చి పడింది. పర్వతం కూలడంతో వారి పంట పండింది. వారి ఆనందానికి హద్దులు, అవధులు లేవు అనుకోండి. మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఆ గ్రామ ప్రజలకు వచ్చిన సంతోషం ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఓ పర్వతం ఉన్నట్టుండి నేలమట్టం అయింది. పర్వతం కూలడంతో ముందుగా అందరూ భయపడ్డారు. కానీ అందులో నుంచి విలువైన రాగి నిక్షేపాలు బయటపడ్డాయి. ఒ కిలో అనుకుంటున్నారా?. టన్నుల కొద్దీ రాగి బయటపడింది. దీంతో అక్కడి ప్రజలు సంతోషంతో వాటిని తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం అధికారుల వరకు కూడా వెళ్లింది.
పర్వతం కూలడంతో స్థానికులు మొత్తం వచ్చారు. ఈ ప్రాంతానికి ఎంతో మంది వచ్చి చూస్తున్నట్టుగా వీడియోలో క్లియర్ గా అర్థం అవుతుంది. రాగి నిల్వలు బయటపడగానే విజిల్స్ వేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. అంతేనా గోల చేస్తూ వాళ్లు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే నార్మల్ గానే కాంగో రాగికి బాగా ఫేమస్. అందుకే 1950ల నుంచి అక్కడ కాపర్ మైనింగ్ చాలా వరకు పెరిగింది. ప్రపంచంలో రాగి ఉత్పత్తిలో టాప్‌లో ఉండటంతో ఈ పేద దేశంపై బడా దేశాల చూపు ఎక్కువగానే పడింది అనడంలో సందేహం లేదు.
రీసెంట్ గా కాంగోలో పర్వతం కూలి రాగి నిల్వలు బయటపడటంతో ఈ ప్రాంతం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ రాగితో స్థానిక ప్రజలు లాభ పడాలి అని ఎందరో కోరుకుంటున్నారు. కానీ బ్రిటీష్, అమెరికా లాంటి దేశాలు అక్కడి వారికి ఆ అవకాశం ఇస్తాయా? అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సంపద, వనరులపై స్థానికులకే సర్వ హక్కులు ఉంటాయని, ఉండాలని ఇతరులు వచ్చి వాటిని దోచుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజన్లు.