Homeలైఫ్ స్టైల్Manchineel Tree: మనుషుల ప్రాణాలను తీసే చెట్టు ఇదే.. ముట్టుకుంటే ప్రాణాలు పోతాయట!

Manchineel Tree: మనుషుల ప్రాణాలను తీసే చెట్టు ఇదే.. ముట్టుకుంటే ప్రాణాలు పోతాయట!

ఈ ప్రపంచంలో కొన్ని వేల చెట్లు, మొక్కలు ఉన్నాయి. మొక్కలు, చెట్లు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ చెట్లలో కొన్ని విషపూరితమైన చెట్లు కూడా ఉంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టుగా మన్షినల్ చెట్టుకు పేరుంది. మనుషుల ప్రాణాలను తీసే చెట్లు అయిన మన్షినల్ చెట్లు ఉత్తర, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి.

Manchineel Tree

ఈ చెట్టు యొక్క ఆకులు, పండ్లు కూడా విషపూరితమే కావడం గమనార్హం. ఈ మన్షినల్ చెట్టు గాలి పీల్చితే శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తాయని సమాచారం. చెట్టు మీద చేయి పెడితే చేతులకు బొబ్బలు వచ్చి ప్రాణాలు పోతాయి. ఈ చెట్టుకు ఉండే పండ్లను లిటిల్ ఆపిల్స్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు చూడటానికి అచ్చం గ్రీన్ ఆపిల్స్ మాదిరిగా ఉంటాయి.

వర్షం కురిసిన సమయంలో ఈ చెట్టు నుంచి జారిపడిన నోటిబొట్టు మన శరీరంపై పడినా కూడా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ చెట్టు కొమ్మల నుంచి వచ్చే తెల్లని స్రవం శరీరం మీద పడిన మంట పుడుతుంది. కరేబియన్ సముద్ర తీరంతో పాటు ఫ్లోరిడా తీరంలో కూడా ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్టు పండులోని కొంత భాగం తిన్నా మనిషి చనిపోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

ఈ చెట్టు ఎత్తు సుమారుగా 50 అడుగుల వరకు ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు మెరుస్తూ కనిపిస్తాయి. కలప ఫర్నీఛర్ తయారీ కొరకు ఈ చెట్ల యొక్క ఆకులను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. కలప ఫర్నీఛర్ తయారీ కోసం ఈ చెట్లను వినియోగిస్తారు. చెట్లను కట్ చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చెట్లను కట్ చేసిన తర్వాత కలపను ఎండలో ఎక్కువ సమయం ఉంచుతారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular