Covid-19 Impact: కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం తెలిసిందే. ప్రపంచం యావత్తు వైరస్ ధాటికి భయాందోళన చెందింది. దీంతో అందరు ఎంత నష్టపోయారో మనకు సుపరిచితమే. దేశవ్యాప్తంగా 26.45 కోట్ల మంది విద్యార్థులు, 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు, 15.07 లక్షల పాఠశాలలు కరోనా ప్రభావానికి గురయ్యాయి. దీంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతుల వరకు 66,65,475 మంది విద్యార్థులున్నారు.

3 నుంచి పదో తరగతి విద్యార్థుల్లో 17,277,892 మంది టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. డీడీ, డీశాట్ ద్వారా 11,34,90 మంది స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్, కంప్యూటర్ల ద్వారా 2,22,680 మంది తరగతులు వింటున్నారు. రాష్ర్టంలో 1,17,570 మంది విద్యార్థులకు ఎలాంటి పరికరాలు లేవని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.
టీవీలు, ఫోన్లు లేని విద్యార్థుల కోసం గ్రామపంచాయతీ ల వద్ద డిజిటల్ పాఠాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. టీచర్లు, స్వచ్చంద సేవలకులు ఇళ్లకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. రాష్ర్టంలో 50 వేల వాట్సాప్ గ్రూపులను పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో డీడీ యాదగిరి, డీశాట్ తో ప్రసారాలు చేస్తున్నారు.
కొవిడ్ అనంతరం అమల్లోకి వచచిన కొత్త పద్ధతుల్లో చదువులపై ప్రభావం చూపింది. ఉఫాధ్యాయులు, ఇతర భాగస్వాముల సామర్థ్యాలతో విద్యార్థులకు పాఠాలు చెప్పాలని చూస్తోంది. విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని చూస్తోంది. వ్యవస్థను ప్రక్షాళన చేసి విద్యార్థులకు చదువు నేర్పించాల్సిన బాధ్యతను తను తీసుకుంది.