
Kanaka Durga Temple: అసలే దసరా ఉత్సవాలు.. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందకు ఆంధ్ర ప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు దేవాదాయ అధికారు… వీరికి తోడు రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలోనూ భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటుచేశారు. దీని ఉద్దేశం భక్తులకు దసరా ఉత్సవాల గురించి వివరించాలి. అమ్మవారి దర్శన వివరాలు.. తదితర పూజల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. కానీ.. ఒక్కసారిగా ఎల్ఈడీపై క్రీస్తుకు సంబంధించిన సందేశాలు కనిపించాయి.
అప్పటి వరకు అమ్మవారి ధ్యానంలో ఉన్న భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పవిత్రమైన అమ్మవారి ఆలయంలో(Kanaka Durga Temple) అదీ.. శరన్నవరాత్రులు జరుగుతున్న క్రమంలో ఇలాంటి అపచార పనులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఈడీలో క్రీస్తు సందేశాన్ని ఓ పాస్టరు వినిపిస్తున్న క్రమంలో భక్తులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. అమ్మవారి ఆలయంలో అదీ.. ఉత్సవాలు జరుగుతూ.. వేలాది మంది భక్తులు దర్శనానికి వేచిస్తున్న క్రమంలో క్రీస్తుకు సంబంధించిన సందేశాలు ప్రత్యక్ష ప్రసారం చేయడం ఏంటని ఒక్కసారిగా రాళ్లు విసిరి ఎల్ఈడీ స్క్రీన్ ను ధ్వంసం చేశారు. ఈ విషయం కాస్తా పెద్దదైంది. వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. విషయం మరింత పెద్దది కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎల్ఈడీని బద్ధలు కొట్టిన వారిపై కేసులు పెడితే విషయం మరింత పెద్దిగా మారుతుందని ముందే గ్రహించిన అధికారులు విషయాన్ని అంతటితో వదిలేశారు. ఇప్పటికే అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటుచేసి ఎల్ఈడీ లైటింగ్ సిస్టం మొత్తం వైఎస్సార్ సీపీ పార్టీ రంగులో ఉందని సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం లాంటిది ఏమీ లేదని మామూలు రంగుల్లోనే లైట్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. వీడియోల్లోనూ వైసీపీ రంగులు కనిపిస్తుండడంతో హిందూ ఆలయంలో ఇలాంటి ఘటనలు ఏపీలో వరుసగా జరుగుతుండడం ఏంటనే అసహనం భక్తుల్లో తీవ్రంగా పెరిగిపోయింది. ఇప్పటికే జరుగుతున్న ఘటనలు ప్రభుత్వానికి ఊపిరాడనివ్వకపోగా.. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగిన ఘటన రాళ్లు రువ్వే కాడికి తీసుకొచ్చింది. చూడాలి మరీ.. ఇంకెన్ని ఘటనలు చూడాల్సి వస్తోందో అని..