Lakshmi Devi To Her Fathers: ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీ దేవి పుట్టిందంటారు. అంతటి అదృష్టముంటుంది ఇంటికి. అందుకే అన్నారు ఆడిది లేని ఇల్లు గాడిది అని. ఆడపిల్లలంటే తండ్రులకు చాలా ఇష్టం. మగపిల్లలంటే తల్లులకు ఇష్టం. దీంతో వారు ఈ పక్షం వీరు ఆ పక్షం ఉండి ఎప్పుడు గొడవలు పడుతుంటారు. ఆడపిల్ల ఇంటికి ఉండే కళ వేరే ఉంటుంది. ఇళ్లంతా శుభ్రంగా ఉంటుంది. నవ్వులతో సరదాగాఉంటుంది. అందుకే ఆడపిల్ల కోసం చాలా మంది తపిస్తుంటారు. ఇక్కడ పేరులో మొదటి అక్షరం వారి జాతకాలను కూడా సూచిస్తుంది. కొందరు ఆడపిల్లలు తండ్రిని తమ దేవుడిగా పూజిస్తారు. అందుకే తండ్రులకు వారిపై మిక్కిలి ప్రేమ.

పేరులోని మొదటి అక్షరం మన జాతక విశేషాలు తెలియజేస్తుంది. మన గుణగణాలను సూచిస్తుంది. మన ప్రవర్తన ఎలా ఉండాలో కూడా చెబుతుంది. దీంతోనే తండ్రులకు లక్కీ గర్ల్ గా కూడా వారు కనిపిస్తారు. కొందరంటారు మా అమ్మాయి పుట్టిన తరువాతే మాకు కలిసొచ్చిందంటారు. నిజమే ఆడపిల్ల పుట్టిన తరువాత చాలా మంది ధనవంతులు అయినవారున్నారు. ఇందులో అతిశయోక్తి లేదు. వారి అదృష్టయోగం అలా ఉంటుంది.
జ్యోతిష్యం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో తన కుమార్తెల ప్రమేయం ఉంటుంది. వారి మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే జాతకంతో తండ్రుల భవితవ్యం కూడా ముడిపడి ఉంది. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే అమ్మాయిలు తండ్రుల జీవితాలను ప్రభావితం చేస్తారని శాస్త్రంలో ఉంది. వారెవరంటే డి అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు ముందు వరసలో ఉన్నారు. వీరు తండ్రికి అదృష్టవంతులుగా పరిగణిస్తారు. తమను ఆదుకునేందుకు వచ్చిన లక్ష్మీదేవిగానే తండ్రులు చూస్తారు.
తండ్రి సంతోషం కోసం ఎంత త్యాగమైనా చేస్తారు అదృష్టం కూడా వీరికి బాగా ఉంటుంది. అందుకే వీరి పట్ల తండ్రులు కూడా ఇష్టపడుతుంటారు. మరో అక్షరం వి తో ప్రారంభమయ్యే వారు కూడా తండ్రులను ప్రేమిస్తారు. తండ్రి ఎదుగుదల కోసం ఏదైనా చేస్తారు. వృద్ధుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. తమ తండ్రుల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తారు. తండ్రిని మంచి స్థానంలో చూడటం కోసం నిరంతరం కష్టపడతారు.

మరో అక్షరం పి తో ప్రారంభమయ్యే అమ్మాయిలు కూడా తండ్రుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. తండ్రికి సంపద తేవడం కోసం నిరంతరం కష్టపడతారు. అనుకున్న పని పూర్తి చేయనిదే నిద్ర పోరు. అంతటి దీక్షా దక్షతలు ఉంటాయి కనుకనే తండ్రులకు ఇష్టమైన వారుగా ఉంటారు. తండ్రి ఎదుగుదలకు తమదైన శైలిలో బాటలు వేస్తారు.
మన సంప్రదాయంలో కొందరు కోడలును కూడా మహాలక్ష్మిగానే చూస్తారు. ఇంటికి గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని సామెత కూడా ఉంది. కొందరికి కోడలుతో కూడా అదృష్టం కలిసొచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో మొత్తానికి ఆడపిల్ల ఇంటికి లక్ష్మిగానే పరిగణించాలి కాని అరిష్టంగా భావించడం భావ్యం కాదు.
Also Read: UK Man Drinks Own Urine Daily: 10 ఏళ్లుగా యవ్వన రహస్యం మూత్రమట.. స్టోర్ చేసుకొని మరీ తాగుతున్నాడే!
[…] Also Read: Lakshmi Devi To Her Fathers: ఈ 3 పేర్లున్న అమ్మాయిలు తండ… […]