Romance: ప్రస్తుత కాలంలో రొమాంటిక్ లైఫ్ పై అందరికి ఆసక్తి తగ్గుతోంది. ఆధునిక కాలంలో అన్ని వేగంగా మారుతున్నాయి. దీంతో సమయం కూడా వేగంగానే కదులుతోంది. వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మారుతున్న కాలంలో జీవన గమనం మందకొడిగా సాగుతోంది. పరిస్థితుల ప్రభావంతో అన్నింట్లోను మార్పులు సహజంగా కనిపిస్తున్నాయి. అలాగే మన జీవితం మీద కూడా పలు విధాలైన ప్రభావాలు చూపుతున్నాయి. ఇటీవల ప్రతి వారిలో దాంపత్య జీవితం ఏదో ఒక భారంగా చూస్తుండటంతో పలు రోగాలు దరి చేరుతున్నాయి. ఫలితంగా జీవన విధానం కూడా మారుతోంది.
ప్రస్తుతం పెళ్లి చేసుకుంటున్న జంటల్లో దాంపత్య జీవితంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఏదో పని ఉన్నట్లు కార్యం ముగించడంతో దంపతుల్లో తీరని వేదనలే కలుగుతున్నాయి. దీంతో ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లైంగిక సంబంధాలు కొనసాగకపోతే డిప్రెషన్ లాంటివి కూడా చోటుచేసుకుంటాయి ఆరోగ్య రీత్యా దాంపత్యం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలుసుకోవాలి. అందు కోసమే జీవిత భాగస్వామిని సంతోష పెట్టే పనికి కొంత సమయం కేటాయించాల్సిందే.
ఉరుకులు, పరుగుల జీవితంలో ఏకాంతానికి వీలు లేకుండా పోతోంది. కార్యాలయ పనులు అంటూ భార్యను దూరం పెడుతున్నారు. దీంతో వారిలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతోంది. లేనిపోని రోగాలు వస్తున్నాయి. వారంలో కనీసం రెండు మూడు రోజులైనా లైంకిక బంధం లేకపోతే అంతే సంగతి. దాంపత్య జీవితంలో సంసార సుఖం కోసం సమయం కేటాయించి ఇద్దరి మధ్య మమతానురాగాలు పెంపొందించుకోవడానికి మార్గాల వెతుక్కోవాలి. భార్య అయినా, భర్త అయినా వారిలో రగులుతున్న కోరికలను అణచుకోకుండా తీర్చుకోవాలి. అప్పుడే ప్రశాంతత వస్తుంది.
Also Read: Anil Ravipudi Rajamouli : రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడినే!
వైద్యులు, నిపుణులు కూడా లైంగిక కార్యం అత్యవసరమని చెబుతున్నారు. శరీరంలో రగిలే కోరికలకు కళ్లాలు వేయకుండా ఆశ పుట్టినప్పుడు తీర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. దీంతో భార్యాభర్తలు తమ భవిష్యత్ ఆరోగ్యం కోసం శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది. దీని కోసమే కోరికలను అణచుకోకుండా తీర్చుకోవడమే మేలు. ఈ నేపథ్యంలో ఆలుమగల సంసారంలో రతిక్రీడే ప్రధానమైనదని గుర్తిస్తే ఏ ఇబ్బంది ఉండదు. దీనికి ఎవరిని బాధ్యులను చేయకుండా తమలోని మధురమైన కోరికలను తీర్చుకుంటూ జీవితాన్ని సుందరస్వప్నంలా మలుచుకుంటే మంచిది.
నాగరికత ప్రపంచంలో అన్ని చకచకా జరుగుతున్నాయి. దీంతో ఆ కార్యం కూడా అలా జరిపితే నష్టమే. అందులో ఉన్న మజాను అనుభవిస్తేనే మాధుర్యం తెలుస్తోంది. రోగాలు రాకుండా చేయడంలో శృంగారం కూడా ఒక భాగమని ఇటీవల ఓ సర్వేలో తేల్చారు. దీంతో ఏదో కార్యంగా భావించకుండా మంచి రసానుభూతి సాధించి జీవితంలో ముందుకు పోవాల్సిందే మరి.
Also Read: Narendra Modi: ఆ విషయంలో నిజంగానే మోడీని మెచ్చుకోవాలి!