
Honey Bees : తేనెటీగలు దాడి చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. అవి కుడితే ప్రాణాలే పోతాయి. అంతటి ప్రమాదకరమైన రీతిలో అవి వెంటపడితే మనకు ఇబ్బందులు తప్పవు. అందుకే వాటి జోలికి ఎవరు కూడా వెళ్లరు. అవి మన వెంట పడ్డాయంటే మన అంతం తప్పదు. అవి కుడితే శరీరం బొబ్బలెక్కాల్సిందే. తీవ్ర స్థాయిలో దాడి చేస్తే ప్రాణాలు పోవడం గ్యారంటీ. ఈ నేపథ్యంలో తేనెటీగలంటేనే మనకు హడల్. తేనెటీగల దాడి తలుచుకుంటేనే వణుకు వస్తుంది. అంతటి భయంకరమైన తేనెటీగలు వెంట పడితే ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో తెలుసు కదా.
ఇరవై వేల తేనెటీగలు తేనెటీగలు వెంటపడిన దృశ్యం వెలుగు చూసింది. రెండు రోజులు కారు వెంటే అవి పరుగెత్తడం అందరికి ఆశ్చర్యం పరచింది. చూసిన వారు సైతం ఆశ్చర్యపోయారు. అవి కారు వెంట పడటానికి కారణం వేరే ఉంది. కారులో రాణి తేనెటీగ చిక్కుకోవడంతో దానికి రక్షణగా ఇవి కారును ఫాలో చేసినట్లు తెలుస్తోంది. రాణి భద్రత కోసమే అవి కారు చుట్టు ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో కారును రెండు రోజుల పాటు ఇరవై వేల తేనెటీగలు వెంబడించిన ఘటన యూకేలోని వేల్క్యు లో వెలుగు చూసింది.
ఓ మహిళ తన కారులో షాపింక్ కు వెళ్లింది. తిరిగి వస్తుండగా ఆ కారు వెనుక తేనెటీగల గుంపు కనిపించింది. దీంతో హతాశురాలైంది. తన కారు వెంట తేనెటీగలు రావడం ఏమిటని అనుకుంది. తన కారులో ఓ రాణి తేనెటీగ కోసం ఇవి వెంబడించినట్లు నిర్ధారణకు వచ్చింది. ఆ తేనెటీగల గుంపును ఓ సారి తరిమేసినా మళ్లీ రావడం చూసి ఆమెకు ఆందోళన కలిగింది. తేనెటీగల పెంపకందారుడు తనదైన రీతిలో కారు నుంచి వాటిని తొలగించి పెట్టెటో బంధించాడు. తేనెటీగలు ఇలా వెంబడించడంపై పోలీసులు కూడా కంగారు పడ్డారు.
మొదటి రోజు తేనెటీగలు పోయాయి కానీ మరుసటి రోజు తేనెటీగల గుంపు మళ్లీ కారులో ఇరుక్కుపోయింది. తేనెటీగల కాలనీ అందులో నివసించే తేనెటీగను మార్చినప్పుడు మొత్తం గుంు రాణి తేనెటీగను అనుసరిస్తుంది. రాణి ఈగ కారులో ఇరుక్కుపోవడంతో తేనెటీగల గుంపు కారును వెంబడిచింది. రాణి తేనెటీగ సాధారణంగా జత కట్టిన ఆడ తేనెటీగ కాలనీ లేదా అందులో నివసించే తేనెటీగలు పూర్తిగా అభివృద్ధి చెందిన పునరుత్పత్తి అవయవాలతో రాణి తేనెటీగలలోని తేనెటీగలు అన్నిటికి కాకపోయినా చాలా వరకు తల్లిగా ఉంటుంది.
తేనెటీగల్లో రాణి తేనెటీగ కీలకంగా వ్యవహరిస్తుంది. తేనెటీగల ఐక్యతను నియంత్రించడంలో ఉపయోగపడే వాసనలను ఉత్పత్తి చేయడం దాని బాధ్యత. తేనెటీగలు గుడ్లు పెట్టడం చేస్తాయి. తేనెటీగలు కొత్తగా పొదిగిన పది రోజుల నుంచి 20 ఆడ లార్వాలను ఎంచుకుంటాయి. వాటి తలలపై భాగాల నుంచి తేనెటీగలు స్రవించే పాల లాంటి తెల్లటి పదార్థమైన రాయల్ జల్లి లాంటి ఆహారాన్ని అందించేందుకు తోడ్పడుతుంది. రాయల్ జల్లి ప్రత్యేకమైన ఆహారం. ఆడ లార్వా దీన్ని పునరుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తాయి.