Four-Day Workweek: శ్రమ దోపిడీ నుంచి, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం ప్రపంచ కార్మిక వర్గం పెద్ద పోరాటమే చేసింది. అనేక మంది ప్రాణత్యాగం ఫలితంగా 8 గంటల పని విధానం అములోకి వచ్చింది. దీని ఫలితంగానే ప్రస్తుతం ఏటా మే 1న కార్మిక దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 8 గంటల పని విధానం ఇప్పటికీ కొన్నిరంగాల్లో అమలు కాకపోయినా.. ఆర్గనైజ్‌డ్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ శాఖల్లో మాత్రం 8 గంటల పని విధానం అమలవుతోంది. వారానికి 48 గంటల పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఖర్చు తగ్గించుకోవడం కోసం, వర్క్ ఎఫీషియెన్సీ పెంచుకునేందుకు, ఎప్లాయిస్ సంక్షేమం కోసం కొన్ని కంపెనీలు ప్రస్తుతం వారానికి 4 రోజుల పని విధానాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఈ అంశంపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విధానం లాభమా? నష్టమా? లాభమైనా.. నష్టమైనా ఎవరికి.. ఏయే రంగాల్లో అమలు చేయవచ్చు అనే అంశాలు ఆసక్తిరేపుతున్నాయి.

జపాన్, న్యూజిలాండ్‌లో అమలు..
జపాన్‌లో మైక్రోసాఫ్ట్ కంపెనీ, న్యూజిలాండ్‌కు చెందిన పర్‌పెక్చువల్ గార్డియన్ కంపెనీలు ప్రస్తుతం వారానికి నాలుగు రోజుల పని విధానం అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో రెండు కంపెనీలతోపాటు ఉద్యోగులు కూడా లాభ పడుతున్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. మైక్రోసాప్ సంస్థ అమలు చేస్తున్న నాలుగు రోజుల పనితో ప్రతీ ఉద్యోగి వారానికి 32 గంటలు పనిచేస్తున్నారు. ఈ విధానంలో కాంపెనీ ఉద్యోగుల్లో వర్క్ ఎఫీషియన్సీ 40 శాతం పెరిగిందని తేలింది.
Also Read: Adani Singareni: సింగరేణిలోకి అదానీ ఎంట్రీ.. కేసీఆర్ కు ముందే తెలుసా..?
అదే సమయంలో విద్యుత్ ఖర్చు, పేపర్ ప్రింటింగ్ ఖర్చు, ఇతర ఖర్చులు చాలా వరకు తగ్గడంతో సంస్థకు లాభం జరుగుతోంది. మరోవైపు ఉద్యోగులు కూడాఉత్సాహంగా, క్వాలిటీ వర్క్ చేస్తున్నారు. మరోవైపు మూడు రోజులు సెలవుతో కుటుంబానికి సమయం కేటాయిస్తున్నారు. మొత్తంగా ఈ పని విధానంతో ఇటు సంస్థ, అటు ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. ఇక న్యూజిలాండ్‌కు చెందిన సంస్థ పర్‌పెక్చువల్ గార్డియన్ అమలు చేస్తున్న పని విధానంతో ఉద్యోగుల్లో వర్క్ ఎఫీషియన్సీ 20 శాతం పెరిగిందని, నష్టం లేదని నిర్ధారించింది.

అన్ని సంస్థల్లో సాధ్యమేనా?
వారానికి నాలుగు రోజుల పని విధానం అన్ని సంస్థల్లో సాధ్యమేనా అంటే కాదనే అంటున్నారు విశ్లేషకులు. జపాన్, న్యూజిలాండ్‌లోనే వర్క్ ఎఫీషియెన్సీ మధ్య వ్యత్యాసం ఉందని, ఈ విధానం అన్ని సంస్థల్లో అమలు చేయడం లాభాలు పొందడం సాధ్యం కాదని పేర్కొంటున్నారు. ఉత్పత్తి రంగంలో సాధ్యమైనా విద్య, వైద్యం లాంటి సేవా రంగాల్లో అమలు చేయడం కష్టమని పేర్కొంటున్నారు. ఈ రంగంలో అమలు చేస్తే ఉద్యోగుల సంఖ్య పెంచుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. తద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంందని చెబుతున్నారు. మరికొన్ని సంస్థలు మాత్రం నాలుగు రోజుల పనితో మేలే అని ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇంధనం ఆదా చేయడం, ట్రాఫిక్ తగ్గిండం, కాలుష్యాన్ని తగ్గిండంతోపాటు ఉద్యోగులకు, సంస్థకు లాభదాయకంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే జపనీస్ హార్డ్ వర్కర్స్, న్యూజిలాండ్‌లో జపనీస్‌లాగా పని చేయలేరు, మన దేశంలో అయితే ఇంకా కష్టం ఇలాంటి పరిస్థితిలో ఇండియాలో 4 రోజుల పని విధానం అమలు చాలా రంగాల్లో అమలు కష్టమే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థల్లో వారానికి ఐదు రోజులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వారానికి 6 రోజులు పని విధానం ఉన్నప్పటికీ చాలా పనులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పూర్తి సామర్థ్యం మేరకు పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో మన దేశంలో ప్రైవేటు సెక్టార్, ప్రభుత్వరంగంలోని కొన్ని సెక్టార్లు మినహా అన్నిరంగాల్లో అమలు సాధ్యం కాదనే పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read:Presidential Election 2022 Results: ఉత్కంఠ: కాబోయే రాష్ట్రపతి ఎవరు..? కౌంటింగ్ షురూ..