Homeక్రీడలుTATA IPL 2023: ముని వేళ్లపై నిలబెడుతున్న ఐపిఎల్.. ఈసారి స్పెషల్ ఇదే

TATA IPL 2023: ముని వేళ్లపై నిలబెడుతున్న ఐపిఎల్.. ఈసారి స్పెషల్ ఇదే

TATA IPL 2023
TATA IPL 2023

TATA IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ హై వోల్టేజ్ ను తలపిస్తోంది. ఏ టీమ్ గెలుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లు దాదాపుగా చివరి ఓవర్ వరకు వస్తున్నాయి. దీంతో ఎవరికి విజయం దక్కుతుందో అన్న టెన్షన్ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్‌ల పరంపర కంటిన్యూ అవుతోంది. చివర బంతి వరకు విజయం ఏ జట్టుకూ దక్కడం లేదు. ఈ వారంలో జరిగిన మ్యాచ్ లు అన్నీ దాదాపు ఇలానే జరిగాయి. చెన్నై సూపర్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరును మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా లాస్ట్ బాల్‌కు విన్నింగ్ షాట్స్ ఆడినవే. ఐపీఎల్ అంటేనే మజా. ఆ కిక్ ఇచ్చే మజాను జట్లు అందిస్తున్నాయి.

ఉత్కంఠకు గురి చేసిన ఆ మ్యాచ్..

ఈ సీజన్లో ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ నెల 9న జరిగిన మ్యాచ్.. ఎంత ఉత్కంఠతకు గురి చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఓడిపోయే మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్. ఈ మ్యాచ్‌తో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు. చివరి ఆరు బంతులకు 29 పరుగులు చేయాల్సిన దశలో ఉన్న జట్టును విజయ తీరాలకు చేర్చడం అంటే మాటలు కాదు. యష్ దయాళ్ వేసిన ఆ ఓవర్ చివరి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

TATA IPL 2023
TATA IPL 2023

 

ఐదు పరుగులే చేయాలి కానీ.. చివరి బంతి వరకూ..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి హైటెన్షనే కనిపించింది. చివరి ఓవర్‌కు ఐదు పరుగులు చేయాల్సిన ఉన్నప్పటికీ చివరి బంతి వరకూ ఈ రెండు జట్ల మధ్య విజయం దోబూచులాడింది. హర్షల్ పటేల్ వేసిన ఆ ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ మొత్తం ఆర్సీబీ వైపు తిరిగిపోయింది. అయితే, చివరి బంతి లెగ్‌ బైగా వెల్లడం, దాన్ని అవేష్ ఖాన్ రన్ తీయడంతో మ్యాచ్ లక్నో వైపు మొగ్గింది. దీంతో లక్నో జట్టు విజయం సాధించింది. విజయం సాధించింది.

విన్నింగ్ షాట్ తో విజయం అందించిన టిమ్ డేవిడ్..

ఢిల్లీ కేపిటల్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి బంతి వరకూ వెళ్లింది. చివరి ఓవర్‌లో ఐదు పరుగులు చేయాల్సిన దశలో.. క్రీజ్‌లో ఉన్న టిమ్ డేవిడ్.. విన్నింగ్ షాట్ ఆడాడు. నొర్టేజే వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 2, 3 బంతులు డాట్స్‌గా పడ్డాయి. దీంతో ఢిల్లీ కేపిటల్స్ గెలుస్తుందనే భావించారంతా. చివరి బంతికి రెండు పరుగులను సాధించాడు టిమ్ డేవిడ్. చివరి పరుగును పూర్తి చేయడానికి డేవిడ్ కొట్టిన డైవ్‌ను ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. ఈ విన్నింగ్ షాట్ తో ముంబై జట్టు విజయం సాధించింది.

ఫోర్ తో విజయం అందించిన తివాటియా..

పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ సాధించిన విజయం కూడా ఇలాంటిదే. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు చేయాల్సి ఉండగా.. పంజాబ్ కింగ్స్ బౌలర్ సామ్ కర్రన్ అద్భుతంగా బౌల్ చేశాడు. ఆ ఓవర్ రెండో బంతికి సుబ్
మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా పంజాబ్ కింగ్స్ వైపు మొగ్గింది. ఆ దశలో క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ తివాటియా.. ఆ ఓవర్ అయిదో బంతిని బౌండరీకి తరలించి జట్టుకు విజయాన్నిఅందించాడు.

TATA IPL 2023
TATA IPL 2023

ఐపీఎల్ అంటేనే సస్పెన్స్..

ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లీగ్ లు జరుగుతుంటాయి. ఎక్కడా లేని విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ విపరీతమైన క్రేజీ ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగడమే. ఎంతటి బలమైన టీమ్ అయినా.. ప్రత్యర్థి జట్టు అద్భుతమైన ప్రదర్శన ముందు ఓటమి పాలు కావాల్సిందే. ఆ విధంగా ప్రతి జట్టు గొప్ప ప్రదర్శనలు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. అందుకే 15 ఎడిషన్లు పూర్తయి 16వ ఎడిషన్ లోకి వచ్చిన ఐపీఎల్ కు క్రేజ్ తగ్గలేదు. పైగా ఏటా ఈ లీగ్ కు క్రేజ్ పెరుగుతూ వస్తుంది. భవిష్యత్తులను ఇటువంటి మరిన్ని గేమ్స్ చూసే అవకాశం ఐపిఎల్ కల్పిస్తుంది. ఆసక్తికరమైన మ్యాచులు జరుగుతుండడంతో అభిమానులు ప్రతి మ్యాచ్ వీక్షించేందుకు భారీగా స్టేడియాలకు వస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular