Telugu Wedding : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ప్రధాన ఘట్టం. ఈ కార్యక్రమాన్ని కొందరు వైభవంగా, సాంప్రదాయాంగా నిర్వహించుకుంటారు. కానీ నేటి కాలంలో సాంప్రదాయాలు పట్టించుకోవడం లేదు. ఇలా చూసి అలా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పూర్వీకులు పెళ్లి క్రతువును వారం రోజుల పాటు నిర్వహించేవారు. పెళ్లి చేసుకునేవారి జీవితాలను దృష్టిలో ఉంచుకొని వీటిని నిర్వహించారు.
పెళ్లిలో నిర్వహించే ఒక్కో కార్యక్రమం పెళ్లి చేసుకోబోయే దంపతుల జీవితాలతో ముడిపడి ఉంటుంది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా నిర్వహించేవారు. పెళ్లిలో అతి ముఖ్యమైన కార్యక్రమం జీలకర్ర, బెల్లం ఒకరి నెత్తిపై మరొకరు పెట్టడం. ఇలా పెట్టిన తరువాత దాదాపు సగం పెళ్లి పూర్తయిందని భావిస్తారు. అయితే ఇలా జీలకర బెల్లం పెట్టడానికి కారణం ఏంటి? అలా ఎందుకు పెడుతారు?
ఒకప్పుడు పెళ్లి చేసుకోబోయే వారు మొహాలు చూసుకునేది కాదు. పెద్దలు వారి పెళ్లి విషయంపై చర్చించి ఆ తరువాత వివాహం చేసేవారు. అయితే పెళ్లి జరిగే సమయంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు జీలకర, బెల్లంతో నే ఒకరినొకరు చూసుకుంటారు. అంతకుముందు ఒకరి నెత్తిపై మరొకరు జీలకర బెల్లం పెట్టి ఆ తరువాత అడ్డుగా ఉన్న వస్త్రాన్ని తీసేస్తారు. ఆ తరువాత మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నేటి కాలంలో పెళ్లికి ముందే అమ్మాయి, అబ్బాయి నచ్చిన తరువాతే పెళ్లి చేస్తున్నారు. అంటే పెళ్లికి ముందే దంపతులు మోహాలు చూసుకుంటున్నారు. అయినా జీలకర ,బెల్లం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అందుకు శాస్త్రీయ కారణంతో పాటు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. జీలకర, బెల్లం పెట్టిన ప్రదేశంలో మనుషులకు విద్యుత్ వలయం ఏర్పడుతుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అప్పటి వరకు శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తొలగించడానికి దీనిని ఇలా పెడుతారు. అలాగే దీని ద్వారా రక్త హీనత తొలగిపోతుంది.
ఇక జీలకర, బెల్లం ద్వారా వధూవరులకు మొదటిసారి స్పర్శ తలుగుతుంది. దీంతో ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటారు. ఇలా మొదటి సారి చూసుకుంటున్నందున వారి జీవితం శుభప్రదంగా ఉండాలని జీలకర, బెల్లం పెడుతారని అంటారు. అంతేకాకుండా మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలను మేల్కోలిపే ప్రయత్నంలో జీలకర, బెల్లం పెడుతారు.