India vs West Indies, 2nd ODI: టీమిండియా విజయాల జోరు కొనసాగిస్తోంది. ఇంగ్లండ్ లో మొదలైన విజయయాత్ర సాగిస్తూనే ఉంది. జట్టేదైనా విజయమే ధ్యేయంగా టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఫలితంగా అపజయమే ఎరుగని జట్టుగా రికార్డులు లిఖిస్తోంది. విదేశీ గడ్డలపై కప్ లు గెలుస్తూ అభిమానులను కనువిందు చేస్తోంది. ప్రేక్షకుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా తనదైన జోరులో ఆటల్లో విజయాలు దక్కించుకుంటోంది. టీమిండియా జట్టుకు ప్రత్యర్థి జట్లు దాసోహం అంటున్నాయి.

ఇంగ్లండ్ లో టీ20, వన్డే సిరీస్ లు నెగ్గి హవా కొనసాగించింది. అదే తీరుగా కరేబియన్ దీవిలో కూడా విజయాలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో టీమిండియా సంబరాలు చేసుకుంటోంది. ఆటగాళ్లలో ఆనందం పెరుగుతోంది. సమష్టిగా రాణించి వెస్టిండీస్ ను 2-0 తేడాతో బోల్తా కొట్టించి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే కప్ ను సొంతం చేసుకోవడంతో మూడో మ్యాచ్ లో కూడా గెలిచి వైట్ వాష్ చేయాలనే ఆలోనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా కసరత్తులు చేస్తోంది.
Also Read: Bandi Sanjay: ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు.. ‘బండి’ ఆఫర్ పనిచేస్తుందా?
ఈ సిరీస్ లో అక్షర్ పటేల్ అద్బుత ప్రదర్శన చేశాడు. 35 బంతుల్లోనే 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అక్షర్ పటేల్ కు శ్రేయాస్ అయ్యర్, శాంసన్ కూడా తోడయ్యారు. ఫలితంగా వెస్టిండీస్ తలవంచింది. ఓటమిని అంగీకరించింది. మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ భారీ స్కోరును ఛేదించింది. పది ఓవర్లలోనే పరులుగు వంద దాటడంతో భారత్ కు ఎదురు లేకుండా పోయింది. వెస్టిండీస్ పతనంలో టీమిండియా రాణింపు తోడైంది. భారీ స్కోరైనా సునాయాసంగా ఛేదించి ప్రత్యర్థి జట్టుకు సవాలు విసిరింది.

దీంతో టీమిండియా సంబరాల్లో మునిగితేలింది. సిరీస్ కైవసం చేసుకోవడంతో కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలో ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మన ఆటగాళ్ల సంబరాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయి. విజయాల జోరుతో మన వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాత్రంతా వారు విందులు, వినోదాలు చేసుకుని మురిసిపోయారు. టీమిండియా సభ్యులు నృత్యం చేస్తూ అందరిని మైమరపించారు.
Also Read:Bandla Ganesh: ఆ దర్శకుడికి బిగ్ షాక్ ఇచ్చిన బండ్ల గణేష్?
Talent wins game but teamwork and intelligence wins championship! 🙌 Kudos to team for the amazing face-off! 😍👏 #IndvsWI pic.twitter.com/jMZOjWiTN6
— Shikhar Dhawan (@SDhawan25) July 25, 2022