Rohit Sharma: ఇంగ్లండ్ లో మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో ఇండియా రెండింటిలో నెగ్గి 2-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ లో సీనియర్లు అందుబాటులోకి రావడంతో జూనియర్లయిన దీపక్ హుడా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అర్ష్ దీప్ సింగ్ లకు విశ్రాంతి నిచ్చి సీనియర్లతో రంగంలోకి దిగిన టీమిండియా అనూహ్య రీతిలో విజయం సాధించడం గమనార్హం. దీంతో మూడు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే ట్రోఫీ సొంతం చేసుకుని ప్రత్యర్థి జట్టును డైలమాలో పడేసంది.

రెండో టీ 20 మ్యాచులో రవీంద్ర జడేజా లేకపోతే మ్యాచ్ గెలిచేవారం కాదని రోహిత్ పేర్కొన్నాడు. అద్భుతమైన ఆట తీరుతో జడేజా ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. అందుకే 170 పరుగులు చేయగలిగాం. కానీ జడేజా కనక చెలరేగి ఆడకపోతే మా పని అంతే. గౌరవప్రదమైన స్కోరు చేసే వాళ్లం కాదు. జడేజా టీంకు బ్యాక్ బోన్ గా అభివర్ణించాడు. 29 బంతుల్లో 46 పరుగులు రాబట్టాడు. ఫలితంగా ఇంగ్లండ్ 121 పరుగులకే కుప్పకూలడంతో మా విజయం ఖాయమైంది.
Also Read: Banners on Hyd wall: బీజేపీ సమావేశం తర్వాత హైదరాబాద్ గోడలపై బ్యానర్లు.. వైరల్
ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో ఉండి రాణిస్తే తప్పకుండా గెలుస్తామని అనుకున్నాం. ఆ బాధ్యతను జడేజా తీసుకున్నాడు. వేగంగా పరుగులు రాబట్టి ఇంగ్లండ్ ఆటగాళ్లను దెబ్బతీశాడు. దీంతో మన స్కోరు పెరిగింది. లేకపోతే గెలిచే వాళ్లం కాదు. కానీ రవీంద్ర జడేజా ఆటతీరుకు రోహిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. భవిష్యత్ లో రవీంద్ర జడేజా మరిన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని కోరుకున్నాడు.

ఇంగ్లండ్ లాంటి బలమైన జట్టుపై విజయం సాధించడం అంటే మాటలు కాదు. దానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కానీ మొత్తానికి విజయం సాధించాం. ఆదివారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందులో కూడా విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ ను క్లీన్ స్వీప్ చేసి పగ తీర్చుకుంటామని చెప్పాడు. టెస్ట్ మ్యాచ్ లో పోయిన పరువును ఇందులో నిలబెట్టుకుంటామని పేర్కొన్నాడు. మొత్తానికి ఇంగ్లండ్ కు చావో రేవో అన్నట్లు గా మారింది. ఒక్క మ్యాచ్ లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ చూస్తుంటే క్లీన్ స్వీప్ చేసి ఇంగ్లండ్ కు తమ సత్తా చాటాలని టీమిండియా అనుకుంటోంది. ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:Ind Vs Eng Pant: అడ్డొచ్చిన ఇంగ్లండ్ బౌలర్.. పంత్ కి రోహిత్ సరదా కోచింగ్.. వైరల్
[…] Also Read: Rohit Sharma: టీమిండియా బ్యాక్ బోన్ అతడేనా? కె… […]